గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: శనివారం, 13 జనవరి 2024 (16:57 IST)

సపోటా పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

Sapota
సపోటా పండ్లు. ఈ పండ్లలో విటమిన్ ఎ, బి, సి పుష్కలంగా ఉన్నాయి. అలాగే సపోటా జ్యూస్‌లో కాపర్, నియాసిన్, ఐరన్, క్యాల్షియం, ఫాస్పరస్‌లు అధికంగా ఉన్నాయి. సపోటా రసం తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
సపోటాలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గ్యాస్ట్రిక్, కడుపులో సమస్యలను నివారిస్తుంది.
సపోటా జ్యూస్ ఎఫెక్టివ్ జ్యూస్, ఇది నాడీ వ్యవస్థను రిలాక్స్ చేస్తుంది, స్ట్రెస్ తగ్గిస్తుంది.
సపోటా జ్యూస్‌లో ఉండే క్యాల్షియం ఎముకలను బలంగా మార్చుతుంది. గర్భిణీలకు శక్తినిస్తుంది.
సపోటా జ్యూస్‌లో విటమిన్ సి వుండటం వల్ల అది వ్యాధినిరోధకత పెంచడంలో సహాయపడుతుంది.
సపోటా జ్యూస్ తాగడం వల్ల వైరల్, బ్యాక్టీరియల్, ఇంటర్నల్ ఆర్గాన్ సిస్టమ్‌లో ప్యారాసిస్టిక్ ఎఫెక్ట్స్‌ను తొలగిస్తుంది.
జ్యూస్‌లో ఉండే విటమిన్ ఎ లంగ్స్, సర్వికల్ క్యాన్సర్ నివారించడంలో సహాయపడుతుంది.
సపోటా జ్యూస్‌లో ఫ్రక్టోజ్- సుక్రోజ్‌లు అధికంగా ఉన్నాయి. ఇవి ఎనర్జీని అందిస్తాయి.
సపోటా జ్యూస్ తాగడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది.