సపోటా మిల్క్‌షేక్ తాగేవారు తెలుసుకోవాల్సినవి
సపోటాను చలికాలంలో ఎక్కువగా తీసుకుంటారు కానీ సపోటాషేక్ తాగితే ఇది బరువు పెరగడంలో సహాయపడుతుంది. ఇంకా దానితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. సపోటాలో గ్లూకోజ్, క్యాలరీలు పుష్కలంగా ఉన్నాయి. ఇది దేహానికి శక్తినిచ్చే వనరుగా చెప్పబడింది. సపోటాషేక్ తాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
చర్మ ఆరోగ్యానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కేశాల పెరుగుదలకు, ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది. పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఎముకలకు సపోటాషేక్ చాలా మంచిది. గర్భిణీ స్త్రీలకు ఇది చాలా ఉత్తమమైనది. పలు రకాల క్యాన్సర్ వ్యాధులను దరిచేరనీయదు.