బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By pnr
Last Updated : శనివారం, 29 జులై 2017 (17:19 IST)

బీరు తాగితే నొప్పి మాయం... ఎలా?

మందు ప్రియులకు ఓ శుభవార్త. ముఖ్యంగా బీరు ప్రియులకు ఇది ఎంతో మంచివార్త. ఎందుకంటే... బీరులో నొప్పిని తగ్గించే గుణాలున్నాయనీ, ఇది పారసిటమల్ మందు కన్నా బాగా పనిచేస్తుందట.

మందు ప్రియులకు ఓ శుభవార్త. ముఖ్యంగా బీరు ప్రియులకు ఇది ఎంతో మంచివార్త. ఎందుకంటే... బీరులో నొప్పిని తగ్గించే గుణాలున్నాయనీ, ఇది పారసిటమల్ మందు కన్నా బాగా పనిచేస్తుందట. ఈ విషయం ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్లడైంది. లండన్‌లో సుమారు 400 మంది మీద నిర్వహించారు. 
 
ఈ లండన్ పరిశోధకులు నొప్పితో బాధపడుతున్న వారిని ఎంపిక చేసి వారికి బీరును ఇచ్చారు. మరికొంతమందికి ఇంగ్లీష్ మందులు ఇచ్చారు. అనంతరం వీరి నొప్పిని పరిశీలించగా బీరు తాగిన వారిలో నొప్పి కొద్దిగా తగ్గుముఖం పట్టగా, మందులు వేసుకున్న వారిలో ఎలాంటి మార్పును వీరు గమనించలేదు. బీరు తాగిన వారిలో అనవసర ఆందోళన తగ్గుముఖం పట్టడాన్ని గుర్తించారు. కేవలం బీరు తాగడం వలనే నొప్పి, ఆందోళన తగ్గాయా‍? మరేదైనా కారణం ఉందా?