శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 ఆగస్టు 2020 (13:33 IST)

కరోనా వైరస్‌కు సరైన విరుగుడు స్టీమ్ థెరపీనే!!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు ప్రజలు వణికిపోతున్నారు. ఈ వైరస్ బారినపడితే ఇక ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందేనన్న భయం ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. పైగా, ఈ వైరస్‌కు చెక్ పెట్టే సరైన మందు ఇప్పటివరకు అందుబాటులో లేదు. దీంతో ప్రతి ఒక్కరూ ఈ వైరస్ భయంతో వణికిపోతున్నారు. 
 
ఈ క్రమంలో కొందరు పరిశోధకులు మాత్రం కరోనా వైరస్‌కు సరైన విరుగుడు ఆవిరి పట్టడమే (స్టీమ్ థెరపీ) ఏకైక మార్గమని చెబుతున్నారు. ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఓ క్రమ పద్ధతిలో ఆవిరి పట్టడం ద్వారా కరోనాకు చెక్ పెట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. 
 
సోషల్ మీడియాలో కనిపించే పోస్టులు, స్నేహితుల సూచనల ఆధారంగా కొందరు వైద్యం చేసుకుంటున్నారని వారు చెబుతున్నారు. కరోనా సోకినవారు తొలి నుంచే జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దాని నుంచి బయటపడవచ్చన్నారు. 
 
ఈ జాగ్రత్తల్లో భాగంగా, ప్రతి రోజూ మూడుపూటలా 15 నిమిషాలపాటు ఆవిరి పట్టడం వల్ల ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. ఓ పాత్రలో మరిగించిన నీటిలో ట్యూబ్ ముందు కానీ, పసుపు కానీ వేసి పావుగంటపాటు ఆవిరి పీల్చాలని వైద్యులు చెబుతున్నారు. 
 
ఇలా చేయడం వల్ల రక్తనాళాలు వ్యాకోచించి వాటి పనితీరు మెరుగుపడుతుందని, శ్వాసక్రియకు అడ్డుపడుతున్న సెకండరీ ఇన్ఫెక్షన్ తొలగిపోయి ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుందని వైద్యులు సలహా ఇస్తున్నారు. 
 
అయితే, కొందరు అతిగా కషాయం తాగేస్తున్నారని, మరికొందరు ఇష్టం వచ్చినట్టు మందులు వాడుతున్నారని వివరించారు. అప్పటికే చాలామంది ఊపిరితిత్తుల్లో ద్రవం చేరి ఆక్సిజన్ వెళ్లకుండా అడ్డుపడుతోందని, పరిస్థితి మరీ విషమిస్తే న్యూమోనియాకు అది దారి తీస్తుందని హెచ్చరించారు.