సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 ఆగస్టు 2020 (13:15 IST)

కరోనా సోకింది.. ఎవరూ తాకొద్దు.. వివాహిత ఆత్మహత్య

ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. తనకు కరోనా సోకిందనీ, అందువల్ల తనను ఎవరూ తాకొద్దని సూసైడ్ నోట్ రాసిపెట్టి ఈ బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్‌లో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చిత్తూరు జిల్లాకు చెందిన 37 యేళ్ల మహిళ తన భర్త, కొడుకు (12)తో కలసి అల్కాపూర్‌లో నివసిస్తోంది. ఈమె ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. 
 
శనివారం రాత్రి భోజనాల తర్వాత అందరూ కలిసే నిద్రపోయారు. ఉదయం 10 గంటల సమయంలో నిద్రలేచిన భర్త.. భార్య కనిపించకపోవడంతో పక్కగదిలోకి వెళ్లి చూడగా, అక్కడ భార్య ఫ్యాన్‌కు విగతజీవిలా వేలాడుతూ కనిపించింది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా ఓ లేఖ దొరికింది. తనకు కరోనా సోకిందని, తనను ఎవరూ తాకవద్దని అందులో రాసిపెట్టి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఆమె ఎక్కడ పరీక్షలు చేయించుకుంది? ఫలితం ఎప్పుడు వచ్చింది? అన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.