మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 14 ఆగస్టు 2020 (19:46 IST)

బావే కదా అని చనువిస్తే మూడుసార్లు గర్భవతి చేశాడు, పెళ్లి చేసుకోమంటే మాత్రం..?

ఒంగోలు పట్టణానికి చెందిన ఒక యువతి స్థానికంగా బట్టలు షాపులో పనిచేస్తోంది. ఆమెకు బంధువు అయిన వెంగముక్కపాలేనికి చెందిన యువకుడు శేఖర్ ఆమెతో పాటే కలిసి పనిచేసేవాడు. ఒకే షాపులో పనిచేయడం.. బంధువు కావడంతో ఆ యువతి శేఖర్‌తో చనువుగా ఉండేది. ఆ చనువును కాస్త ఆసరాగా చేసుకున్నాడు శేఖర్. సంవత్సరం నుంచి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు.
 
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో గడిపేవాడు. ఇలా మూడుసార్లు ఆమెకు అబార్షన్ చేయించాడు. బావే కదా అని తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పలేదు యువతి. అయితే వివాహం చేసుకోవడానికి శేఖర్ ఒప్పుకోకపోగా గత రెండురోజుల క్రితం తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని ఒకే చేసేశాడు.
 
ఈ విషయం కాస్త యువతికి తెలియడంతో మోసపోయానని తల్లిదండ్రులకు అసలు విషయాన్ని చెప్పేసింది. దీంతో పోలీసులకు ఆశ్రయించారు యువతి తరపు బంధువులు. అయితే తనకేమీ సంబంధం లేదని శేఖర్ బుకాయించే ప్రయత్నం చేయడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.