శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 ఆగస్టు 2020 (17:55 IST)

భోజనం చేసిన వెంటనే నిద్రపోతున్నారా? ఎడమ వైపున తిరిగి నిద్రిస్తున్నారా? (Video)

భోజనం చేసిన రెండు గంటలయ్యాక నిద్రపోవాలని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. ఉదయం లేక మధ్యాహ్న భోజనం తర్వాత 30 నుండి 40 నిమిషాల వరకు కచ్చితంగా నిద్రపోవాలి. ఏ కారణం చేతనైనా విశ్రాంతి తీసుకునే అవకాశం లేని వారు కనీసం పది నిమిషాల పాటు వజ్రాసనం వేయడం చేయాలి.

ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత వెంటనే నిద్ర పోకూడదు. కనీసం రెండు గంటల తర్వాత నిద్రపోవాలి. ఇలా చేస్తే డయాబెటీస్, హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదముందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. 
 
అలాగే పడుకునే విధానంలో జాగ్రత్త పడాలి. ఎడమ ప్రక్కకు తిరిగి, ఎడమ చెయ్యి క్రిందకు వచ్చే విధంగా పడుకొని విశ్రమించాలి. దీనిని వామ కుక్షి అవస్థలో విశ్రమించటం అంటారు. మన శరీరంలో సూర్యనాడి, చంద్ర నాడి, మధ్యనాడి అనే మూడు నాడులున్నాయి. సూర్యనాడి భోజనాన్ని జీర్ణం చేసేందుకు పనికొస్తుంది. ఈ సూర్య నాడి ఎడమ వైపు తిరిగి పడుకుంటే చక్కగా పనిచేస్తుంది.
 
 
అందుకే అలసత్వానికి గురైనప్పుడు ఇలా ఎడమ వైపుకు తిరిగి నిద్రించడం ద్వారా అలసత్వం తొలగిపోతుంది. ఇంకా రోజంతా ఉత్సాహంగా పనులు చేసుకుంటారు. ఇలా ఎడమవైపుకు తిరిగి నిద్రించడం ద్వారా గురక తగ్గిపోతుంది. గర్భిణీ స్త్రీలకు మంచి రక్త ప్రసరణ జరుగుతుంది. గర్భాశయానికి, పిండానికి.. మూత్రపిండాలకు రక్తప్రసరణ జరుగుతుంది. 
 
అలాగే వెన్నునొప్పి, మెడనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. భోజనం తర్వాత జరిగే జీర్ణక్రియలో సహాయపడుతుంది. శరీరంలోని వ్యర్థాలన్నీ తొలగిపోతాయి. కాలేయం, మూత్రపిండాలు మెరుగ్గా పనిచేస్తాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గుండెకు శ్రమ తగ్గి సక్రమంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. హృద్రోగాలు దూరమవుతాయి. 
 
కొవ్వు పదార్ధాలు సులభంగా జీర్ణమవుతాయి. మెదడు చురుకుగా పని చేస్తుంది. అల్జీమర్స్ వ్యాధులుండవు. అందుకే ఆయుర్వేదం ప్రకారం ఎడమ వైపున తిరిగి పడుకొనే విధానం చాలా ఉత్తమమైన పద్ధతి అంటున్నారు నిపుణులు.