శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : శనివారం, 15 ఆగస్టు 2020 (13:36 IST)

జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

pawan kalyan
74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం అధ్యక్షులు పవన్ కళ్యాణ్  జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం చేశారు.
 
కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. జాతీయ పతాకానికి వందనం చేసిన అనంతరం భారతమాత, గాంధీజీ చిత్రపటాలకు సుమాంజలి అర్పించారు. 
 
ఈ కార్యక్రమంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, తెలంగాణ ఇంచార్జ్ శ్రీ శంకర్ గౌడ్ పార్టీ ముఖ్య నేతలు షేక్ రియాజ్, శ్రీ వై.నగేష్, అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి శ్రీ పి.హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.