గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. స్వాతంత్ర్య దినోత్సవం
Written By selvi
Last Updated : శుక్రవారం, 26 జనవరి 2018 (09:29 IST)

రిపబ్లిక్ డే స్పెషల్ : భారత రాజ్యాంగ రచనా భారమంతా ఎవరిదో తెలుసా?

మనకు 1947 ఆగష్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. అయితే వాస్తవానికి ఆ రోజు నుంచే పూర్తిగా భారత్‌కు స్వాతంత్ర్యం రాలేదు. భారతదేశం స్వతహాగా ఓ వ్యవస్థగా ఎదగాలంటే.. ఒక రాజ్యాంగం అవసరం. ఆ రాజ్యాంగాన్ని రూపొందించ

మనకు 1947 ఆగష్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. అయితే వాస్తవానికి ఆ రోజు నుంచే పూర్తిగా భారత్‌కు స్వాతంత్ర్యం రాలేదు. భారతదేశం స్వతహాగా ఓ వ్యవస్థగా ఎదగాలంటే.. ఒక రాజ్యాంగం అవసరం. ఆ రాజ్యాంగాన్ని రూపొందించేందుకు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్‌గారి నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ అప్పటి ప్రజాస్వామ్య దేశాలయిన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల రాజ్యాంగాలను పరిశీలించి వాటిలోని మంచిని గ్రహించి రూపొందించబడింది. తద్వారా ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యదేశమైన మన భారతీయ రాజ్యాంగం ఎంతో గౌరవించదగినది.
 
అలాంటి రాజ్యాంగాన్ని రూపొందించడం కోసం ఏర్పాటైన కమిటీలో సభ్యులున్నా.. భారం మొత్తం డాక్టర్ అంబేద్కర్‌పైనే పడిందట. రాజ్యాంగ పరిషత్తు సభ్యుడిగా.. మంత్రివర్గ సభ్యుడిగా అంబేద్కర్ నియామకం అయినారు. రాజ్యాంగ పరిషత్తు సభ్యుడుగా అంబేద్కర్ విశేషంగా శ్రమించారు. ఆయన శేష జీవితంలో రాజ్యాంగం రచించడం ప్రముఖమైన ఘట్టంగా మిగిలింది. 
 
అంబేద్కర్ రాజ్యాంగ రచనపై టి.టి కృష్ణమాచారి (కేంద్రమంత్రి) ఒకమారు అప్పటి రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడుతూ.. ''రాజ్యాంగ రచనా సంఘంలో నియమింపబడిన ఏడుగురిలో ఒకరు రాజీనామా చేశారు. మరొకరు మరణించారు. వేరొకరు అమెరికాలో వుండి పోయారు. ఇంకొకరు రాష్ట్ర రాజకీయాలలో నిమగ్నులయ్యారు. ఇక ఈ కమిటీలో వున్న ఒకరిద్దరు ఢిల్లీకి ఆమడ దూరంలో ఉన్నారు. 
 
అందుచేత భారత రాజ్యాంగ రచనా భారమంతా డా.అంబేద్కర్ మోయవలసి వచ్చింది. రాజ్యాంగ రచన అత్యంత ప్రామాణికంగా వుంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు'' అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను బట్టి.. రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ అంబేద్కర్ కృషి ప్రశంసనీయం.. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.