శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 నవంబరు 2023 (11:13 IST)

డ్రిల్‌లో పాల్గొన్న బాలుడు.. గుండెపోటు మృతి

Heart
జూనియర్ రిజర్వ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ కార్ప్స్ డ్రిల్‌లో పాల్గొన్న బాలుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి మృతి పట్ల స్కూల్ ప్రిన్సిపాల్ విచారం వ్యక్తం చేశారు. రన్నింగ్ చేస్తూ మాక్ వెన్ కుప్పకూలడం దురదృష్టకరమన్నారు. బాలుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
 
డేవిస్ వెస్ట్రన్ హైస్కూల్‌లో చదువుతున్న బాలుడు కుటుంబ స్నేహితుడు గోఫండ్ మి క్యాంపెయిన్ చేపట్టగా అంత్యక్రియల నిర్వహణకు 66 వేల డాలర్టు సమకూరాయి.
 
బాలుడి తల్లి జూలీ గతేడాది క్యాన్సర్ బారినపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా ఇప్పుడు కొడుకు గుండె పోటుతో మరణించడం అందరి హృదయాలను కలిచివేస్తోంది.