ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 31 అక్టోబరు 2023 (20:32 IST)

ట్యూషన్ టీచర్‌కి విద్యార్థికి మధ్య ఏదో జరుగుతుందని బాలుడిని హత్య చేసిన ప్రియుడు

crime
కాన్పూరులో 17 ఏళ్ల బాలుడి హత్యను ఛేదించారు పోలీసులు. తొలుత డబ్బు కోసం బాలుడిని హత్య చేసి వుంటారని అనుకున్నారు. కానీ అసలు వ్యవహారం వేరే వున్నదని పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. యూపీలోని కాన్పూరులో వుంటున్న 17 ఏళ్ల పదవ తరగతి విద్యార్థిని మరిన్ని మార్కులు రావాలని తమ ఇంటికి సమీపంలో వుండే రచిత అనే టీచర్ దగ్గర నైట్ ట్యూషన్ చేరాడు.
 
ప్రతిరోజూ ఉపాధ్యాయురాలి దగ్గరికి వెళ్లి పాఠాలు చెప్పించుకుంటుండేవాడు. ఐతే బాలుడికి టీచర్ కి మధ్య ఏదో నడుస్తుందన్న అనుమానం పెంచుకున్నాడు ఆమె ప్రియుడు ప్రభాత్ శుక్లా. దీనితో అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో టీచర్ రచిత పిలుస్తుందంటూ బాలుడిని నమ్మించి తన బైకుపై ఎక్కించుకుని స్టోర్ రూములోకి తీసుకుని వెళ్లాడు.
 
సీసీ కెమేరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. స్టోర్ రూంలోకి ఇద్దరు వెళ్లగా తిరిగి వచ్చేటపుడు ప్రభాత్ ఒక్కడే వచ్చాడు. ఆ తర్వాత గదిలో తన దుస్తులు మార్చుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఐతే విద్యార్థి తండ్రి ఢిల్లీలో బడా పారిశ్రామకవేత్త అని తెలిసింది. ఈ క్రమంలో బాలుడిని అడ్డుపెట్టుకుని డబ్బు కోసం డిమాండ్ చేసినట్లు కూడా తెలిసింది. ఐతే ప్రధాన కారణం... టీచర్-విద్యార్థికి మధ్య ఏదో జరుగుతుందన్న అనుమానంతో చంపేసినట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది.