ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 ఆగస్టు 2023 (13:03 IST)

ప్రియుడితో వాగ్వివాదం.. ఆగ్రహంతో హైటెన్షన్ విద్యుత్ టవరెక్కిన యువతి

high tension eb tower
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బాగా నవ్వు తెచ్పించే ఓ సంఘటన జరిగింది. తన ప్రియుడితో తీవ్ర వాగ్వివాదానికి దిగిన ఓ యువతి.. ఆగ్రహంతో ఏకంగా హైటెన్షన్ విద్యుత్ తీగలతో ఉండే టవరెక్కింది. ఆమెను కిందకు దించేందుకు ప్రియుడు కూడా ఇదే పనికి పాల్పడ్డాడు. వీరిద్దరి చర్య ఆ గ్రామ వాసులకు ఓ వినోదంగా మారింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గరేలా పెండ్ర మర్వాహి జిల్లాకు చెందిన ఓ చెందిన ఓ యువతి అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. అయితే, వారిద్దరి మధ్య చిన్నపాటి వివాదం తీవ్ర వాగ్వివాదానికి దారితీసింది. దీంతో ప్రియుడిపై ఆగ్రహించిన ఆమె... 80 అడుగుల ఎత్తయిన విద్యుత్ హెటెన్షన్ టవర్‌పైకి ఎక్కింది. ఆమెను బుజ్జగించి కిందకు తీసుకొద్దామని చెప్పి ఆ యువకుడు కూడా అదే టవర్‌ ఎక్కి కూర్చొన్నాడు. 
 
ఒకరి ద్వారా ఒకరి ఇలా గ్రామమంతా ఈ విషయం తెలియడంతో ఆ టవర్ల వద్దకు గ్రామస్తులంతా చేరుకున్నారు. ఇంతలో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆ ప్రేమజంటకు నచ్చజెప్పడంతో వారు శాంతించి కిందకు దిగారు. ఆ తర్వాత యువతీ యువకులను హెచ్చరించి పంపించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని సూచించారు.