శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

అక్కా చెల్లెళ్లపై అత్యాచారం.. అవమానం భరించలేక ఆత్మహత్య.. ఎక్కడ?

victim
ఈశాన్య భారత రాష్ట్రాల్లో అస్సాం ఒకటి. ఇప్పటికే మణిపూర్ రాష్ట్రంలో అల్లర్లు, హింస పెట్రేగిపోయింది. ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలను అదుపు చేసేందుకు కేంద్రం ఎన్నో రకాలుగా చర్యలు చేపట్టినా ఫలితం మాత్రం నామమాత్రంగానే కనిపిస్తుంది. ఇదిలావుంటే, అస్సాంలో మరో దారుణం జరిగింది. వరుసకు అక్కాచెల్లెళ్ళు అయిన 17, 19 యేళ్ల వయస్సున్న యువతులపై కొందరు కామాంధులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ అవమానాన్ని జీర్ణించుకోలేక వారు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన రాష్ట్రంలోని కామరూప్ జిల్లాలోని తులసిబారి ప్రాంతంలో జరిగింది. 
 
ఈ అత్యాచార ఘటనను వారు జీర్ణించుకోలేక పోయారు. దీంతో తీవ్ర మనస్తాపానికి చెందిన వారిద్దరూ నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి చెట్టుకు ఉరేసుకున్నారు. చెట్టుకు వేలాడుతున్న వీరి మృతదేహాలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వచ్చి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే, పోస్టుమార్టం నివేదిక వచ్చేవరకు ఏమీ మాట్లాడలేమని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.