గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 మే 2023 (10:49 IST)

గౌహతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల దుర్మరణం

road accident
అస్సాం రాష్ట్ర రాజధాని గౌహతిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గౌహతిలోని జలూక్‌బరీ ప్రాంతంలో రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులు అక్కడికికక్కడే మృతిచెందగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. వీరంతా గౌహతిలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్నట్లు తెలిసింది.
 
ప్రమాద వార్త తెలుసిన వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. అలాగే, క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.