శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 మే 2023 (12:03 IST)

రోడ్డు డివైడర్‌ను ఢీకొన్న కారు.. హీరో శర్వానంద్‌‍కు గాయాలు

sharwanand
టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తూ వచ్చిన కారు రోడ్డు డివైడర్‍ను ఢీకొట్టింది. దీంతో ఆయనకు గాయాలయ్యాయి. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున రాంగ్‌ రూట్‌లో వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
 
అయితే, ఈ ప్రమాదంపై శర్వానంద్ స్పందించారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని చెప్పారు. ఫిల్మ్ నగర్ జంక్షన్ వద్ద కారు అదుపు తప్పిందని, ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని చెప్పారు. అందువల్ల దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శర్వానంద టీం సభ్యులు వెల్లడించారు. పైగా, ఇది చాలా స్వల్ప ఘటన అని, ఎవరికీ గాయాలు కాలేదని చెప్పారు.