గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 అక్టోబరు 2023 (17:13 IST)

ప్రేమికుడితో పారిపోయిందని సొంత కూతుర్ని నరికేసిన తండ్రి

crime scene
ప్రేమికుడితో కలిసి పారిపోయిందనే కోపంతో ఓ తండ్రి తన కుమార్తెను పొట్టనబెట్టుకున్నాడు. ప్రేమ కారణంగా పారిపోయిందని.. సొంత కూతురిని కొడవలితో అతి కిరాతకంగా నరికి చంపిన అమానవీయ ఘటన బెంగళూరు నగరంలో కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని పరప్ప అగ్రహార పోలీస్ స్టేషన్ పరిధిలో మైసూరులోని హెచ్‌డీ కోటేకు చెందిన పల్లవి (17) అనే యువతి దారుణ హత్యకు గురైంది. పల్లవి తండ్రి గణేష్ (50)ను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 
కూతురు పల్లవిని హత్య చేసి ముగ్గురు కుటుంబ సభ్యుల మీద కొడవలితో దాడి చేసిన గణేష్ నేరుగా పరప్ప అగ్రహార పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. నిందితుడు గణేష్‌ను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించామని సోమవారం పోలీసు అధికారులు తెలిపారు.