శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 అక్టోబరు 2020 (14:24 IST)

తాలిబన్ దాడులు.. 16మంది ఆప్ఘన్ సైనికుల మృతి

Afghanistan
ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని భాగ్ లాన్ ప్రావిన్సులోని గోజార్గాహ్ఎ నూర్ జిల్లాలో సెక్యూరిటీ చెక్ పాయింటుపై తాలిబన్లు దాడి చేశారు. ఈ దాడిలో 16 మంది ఆఫ్ఘాన్ సెక్యూరిటీ సిబ్బంది మరణించారు. ఈ దాడి ఘటనలో మరో 10 మంది గాయపడ్డారని ఆఫ్ఘనిస్థాన్ అధికారులు చెప్పారు. 
 
తాలిబన్లు పోలీసు హెడ్ క్వార్టర్సుకు సమీపంలోనే దాడికి పాల్పడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ప్రావిన్షియల్ గవర్నర్ ప్రతినిధి ఒమర్ జవాక్, నవా జిల్లాలో జరిగిన ప్రమాదాన్ని ధృవీకరించారు. వైమానిక దాడుల కారణంగా 10మంది ఆప్ఘన్ భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఒమర్ జవాక్ తెలిపారు. 
 
గోజర్గా-ఏ-నూర్ జిల్లాలోని బాగ్లాన్‌ ప్రావిన్స్‌లోని పోలీసుల హెడ్‌క్వార్టర్స్‌ సమీపంలో తాలిబన్లకు భద్రతాదళాలకు మధ్య హోరాహోరీ ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. అంతర్-ఆఫ్ఘన్ చర్చలను ప్రారంభించేలా ఖైదీల మార్పిడీకి అష్రఫ్ ఘని ప్రభుత్వం తాలిబన్లతో శాంతిచర్చలు జరపుతున్నాదాడులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. 
 
దాదాపు రెండు దశాబ్దాలపాటు కొనసాగిన యుద్ధంలో పదివేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. గత రెండు నెలల క్రితమే ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం- తాలిబాన్ల మధ్య శాంతి చర్చలు ప్రారంభమైన విషయం తెలిసిందే.