గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (11:28 IST)

1971 యుద్ధంలో వైజాగ్ పోర్టును ధ్వంసం చేయాలని పాక్ ప్లాన్ వేసింది : ఆర్మీ మాజీ రీజనల్ డైరెక్టర్‌

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రమూకల శిబిరాలపై దాదాపు 70 మంది భారత ఆర్మీ సైనికులు బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత మెరుపుదాడి చేశారు. ఏడు ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసి 38 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టా

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రమూకల శిబిరాలపై దాదాపు 70 మంది భారత ఆర్మీ సైనికులు బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత మెరుపుదాడి చేశారు. ఏడు ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసి 38 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. వారం రోజులుగా నిఘా పెట్టి దాడులు చేశారు. ఈ సైనిక ఆపరేషన్‌ను వీడియోలోనూ చిత్రీకరించారు.

ఉగ్ర శిబిరాలపై భారత దాడి బూటకంగా పాకిస్థాన్ చెబుతున్న నేపథ్యంలో ఈ వీడియో ఆధారాలను విశ్లేషిస్తున్న భారత ఆర్మీ త్వరలో ఆ వీడియోను కూడా బయటపెట్టనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా చేసిన దాడుల తరువాత పాకిస్థాన్ ఖచ్చితంగా ప్రతీకార చర్యలు చేస్తుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్‌‌లో ఆర్మీ రీజనల్ డైరెక్టర్‌గా పనిచేసిన కృష్ణారావు మాట్లాడుతూ… పాకిస్థాన్ ప్రతీకార దాడులకు దిగడం ఖాయమని, అయితే సాధారణ ప్రజానీకం భావిస్తున్నట్టు పాకిస్థాన్ ప్రతీకార దాడులు కేవలం జమ్మూకాశ్మీర్‌లోనే ఉండవని, భారత్‌లోని సుదీర్ఘ సరిహద్దుల వెంబడి ఎక్కడి నుంచైనా పాకిస్థాన్ దాడులకు తెగబడే అవకాశం ఉందని వెల్లడించారు. 
 
1971లో పాకిస్థాన్‌తో యుద్ధం జరిగిన సమయంలో… పాకిస్థాన్ సబ్ మెరైన్ ఘాజీ ఎవరికీ దొరకకుండా భారత నావికా దళానికి ఆయువుపట్టైన విశాఖపట్టణం వచ్చి పోర్టును చిందరవందరగా చేసేసి, వెనుదిరగాలని ప్లాన్ చేసుకుంది. అయితే భారత ప్రభుత్వం నీటిలో అమర్చిన వాటర్ ల్యాండ్‌మైన్ పైకి అది రావడంతో ముక్కలైపోయింది. లేని పక్షంలో భారత్ ఊహించని నష్టాన్ని జరిపి వెళ్లి ఉండేదని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తాజాగా కూడా ఇలాంటి దాడులకు దిగే అవకాశం ఉందని అన్నారు.