శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 జులై 2020 (12:46 IST)

మెక్సికోలో డ్రగ్స్‌ డీ-అడిక్షన్ సెంటర్‌పై కాల్పులు.. 24మంది మృతి

drug rehab center
మెక్సికోలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉంది. ప్రస్తుతం అక్కడ 2,26,089 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవ్వగా 27,769 మంది మృతి చెందారు. ఇలాంటి పరిస్థితుల్లో మెక్సికోలో కొందరు దుండగులు మారణహోమం సృష్టించారు. ఈ ఘటన గువానాహువాటో రాష్ట్రం ఇరాపూవాటోలోని మాదకద్రవ్యాల బాధితుల పునరావాస (డ్రగ్స్‌ డీఅడిక్షన్‌) కేంద్రంపై ఈ దాడిలో ఏకంగా 24 మంది మృతి చెందారు. 
 
అలాగే మరో ఏడుగురికి తీవ్ర గాయాలవ్వగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. ఈ కాల్పుల వెనుక కారణాలు ఇంకా తెలియరాలేదని, స్టానిక డ్రగ్ సరఫరాదారుల ముఠాకు సంబంధం ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
 
ఇరపువాటలో నెల రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన కావడం గమనార్హం. జూన్‌ 6న కూడా పునరావస కేంద్రంపై ఓ ఆగంతకుడు కాల్పులకు తెగబడటంతో 10 మంది మరణించారు. గతంలో 2010లో చివావా నగరంలోని డ్రగ్స్‌ డీఅడిక్షన్‌ సెంటర్‌పై ఇదేవిధంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 19 మంది మృతి చెందారు.