1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 1 ఏప్రియల్ 2019 (12:18 IST)

మండు వేసవి... నేపాల్‌లో తుఫాను-25మంది మృతి

నేపాల్ దేశాన్ని తుఫాన్ వణికించింది. మండు వేసవిలో తుఫాను ప్రభావంతో భారీ వర్షాలకు 25మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాల కారణంగా 400ల మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. 


నేపాల్ రాజధాని ఖాట్మండు నగరానికి దక్షిణాన 120 కిలోమీటర్ల దూరంలోని బారా జిల్లాలోని పలు గ్రామాలు తుపాన్
ధాటికి చిగురుటాకులా వణికిపోయాయి. ఈ తుఫాను ధాటికి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేసున్నారు. 
 
భారీ వర్షాల ప్రభావంతో పలు గ్రామాలు నీటమునిగిపోగా.. పెనుగాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయి రోడ్లపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

తుఫాను సందర్భంగా నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ మాట్లాడుతూ.. వరదనీటిలో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు నేపాల్ నైట్ విజన్ సైనికులు హెలికాప్టర్లతో రంగంలోకి దింపినట్లు వెల్లడించారు.