బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 4 జూన్ 2018 (12:12 IST)

పేలిన అగ్నిపర్వతం.. 25 మంది మృతి.. వీడియో

సెంట్రల్ అమెరికా దేశమైన గ్వాటెమాలలోని ఫ్యూగో అగ్ని పర్వతం బద్ధలైంది. ఈ పేలుడు ధాటికి ఇప్పటివరకు 25 మందికి పైగా మృత్యువాతపడ్డారు. మరో 30 మంది వరకు గాయపడ్డారు. కొన్ని వేల మందిని అక్కడి నుంచి తరలించారు.

సెంట్రల్ అమెరికా దేశమైన గ్వాటెమాలలోని ఫ్యూగో అగ్ని పర్వతం బద్ధలైంది. ఈ పేలుడు ధాటికి ఇప్పటివరకు 25 మందికి పైగా మృత్యువాతపడ్డారు. మరో 30 మంది వరకు గాయపడ్డారు. కొన్ని వేల మందిని అక్కడి నుంచి తరలించారు.
 
ముఖ్యంగా, అగ్నిపర్వతం బద్ధలు కావడంతో లావా నదిలోని నీటిలా ప్రవహిస్తోంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలను దహించి వేస్తోంది. ఆకాశంలో పది కిలోమీటర్ల ఎత్తున దట్టమైన పొగ మేఘాలు కమ్ముకున్నాయి. ఆదివారం రాత్రి ఒక్కసారిగా ఈ అగ్నిపర్వతం పేలడంతో మృతుల సంఖ్య పెరిగినట్టు సహాయక అధికారులు వెల్లడించారు. 
 
మరోవైు, ఈ అగ్నిపర్వతం పేలుడు కనీసం 17 లక్షల మందిపై ప్రభావం చూపనున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఫ్యూగో సమీపంలో ఉండే 3100 మంది ప్రజలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు తెలిపారు. 
 
సెంట్రల్ అమెరికాలో అత్యంత క్రియాశీలకంగా ఉండే అగ్ని పర్వతాల్లో ఫ్యూగో ఒకటి. ఆంటిగ్వా నగరానికి దగ్గర్లో ఈ అగ్నిపర్వతం ఉంది. ఈ పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలన్నీ ధ్వంసమయ్యాయి.
 
అగ్ని పర్వతానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని గ్వాటెమల సిటీకి కూడా కొంత మొత్తంలో బూడిద చేరడం గమనార్హం. అంతర్జాతీయ విమానశ్రయం రన్‌వేపైకి కూడా ఈ బూడిద చేరడంతో ఎయిర్‌పోర్ట్‌ను మూసివేశారు. ఈ అగ్ని పర్వతం మరికొన్ని రోజులు ఇలాగే లావాను వెదజల్లుతుందని అధికారులు చెప్పారు.