రూ.12వేలకు బదులు రూ.12లక్షల్ని విరాళంగా ఇచ్చిన వ్యక్తి.. ఎక్కడ?  
                                       
                  
                  				  విరాళాలు ఇవ్వడం మంచి కార్యమే. ఆ దానమే ఒకరికి షాక్ ఇచ్చింది. ఇటీవల కాలిఫోర్నియా వ్యక్తి  మైకెల్ బంగ్లాదేశ్‌కి చెందిన ఓ ట్రస్టుకు రూ.12,435కి బదులుగా రూ.12 లక్షలకు పైగా డబ్బు పంపాడు. ఈ విషయం తెలుసుకుని షాకయ్యాడు. 
				  											
																													
									  
	 
	12వేలకు బదులుగా 12 లక్షల రూపాయలను బంగ్లాదేశ్‌లోని పేదలకు అందించాడు. కానీ అనూహ్యంగా 12వేలకు బదులు 12లక్షల నగదును ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. 
				  
	 
	ఆపై సంబంధిత ట్రస్టుతో మైకేల్ మాట్లాడినట్లు తెలుస్తోంది. 12వేలకు బదులు 12 లక్షల్ని తప్పుగా పంపానని.. ఆ డబ్బును తిరిగి ఇవ్వాల్సిందిగా కోరాడు. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	అయితే 12 వేలకు బదులు ఇచ్చిన 12 లక్షల్లో సదరు ట్రస్టు మైకేల్‌కు డబ్బును తిరిగి ఇచ్చిందా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. కానీ రూ.12వేలకు బదులు రూ.82,906 చెల్లించి.. మిగిలిన డబ్బును తిరిగి పొందినట్లు తెలుస్తోంది.