ఇథియోపియాలో తొక్కిసలాట.. భాష్పవాయువు ప్రయోగం, కాల్పుల్లో 50మంది మృతి?
ఇథియోపియాలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒరోమియా ప్రాంతంలో మతపరమైన కార్యక్రమం సందర్భంగా ఆదివారం ఓ వర్గానికి చెందిన ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళ
ఇథియోపియాలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒరోమియా ప్రాంతంలో మతపరమైన కార్యక్రమం సందర్భంగా ఆదివారం ఓ వర్గానికి చెందిన ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తూ.. తిరుగుబాటుదారులకు సంబంధించిన జండాను ఎగురవేశారు. దీంతో వారిని చదరగొట్టే క్రమంలో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 50 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రతిపక్ష పార్టీలు వెల్లడించాయి.
ఆఫ్రికాలోనే అతిపెద్దదైన సాంస్కృతిక ఉత్సవం నిర్వహిస్తున్న ప్రజలపై ఒరోమోలో ఆదివారం పోలీసు బలగాలు బాష్పవాయువు ప్రయోగించడంతోపాటు విచక్షణరహితంగా కాల్పులు జరిపాయి. కనీసం 295 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. వర్షాకాలం ముగిసి వసంతంలో అడుగుపెట్టే కాలానికి సూచికగా ఒరోమో ప్రావిన్స్ అంతటా ‘ఇరీచా’ ఆధ్యాత్మిక వేడుక జరుగుతుంది.
ఇథియోపియాలోని పది కోట్ల మంది జనాభాలో సగం మంది ఈ ప్రావిన్స్‌లోనే ఉంటారు. ఫెడరల్ ప్రభుత్వం వీరి హక్కులను కాలరాస్తోంది. కాల్పులు జరిగిన విషయాన్ని ఫెడరల్ ప్రభుత్వం అంగీకరించింది. అయితే మృతుల సంఖ్యను ప్రభుత్వం ఇంకా ధ్రువీకరించలేదు.