భార్యపై ప్రతీకారం.. 890 కేజీల బరువున్న నాణేలను భరణంగా ఇచ్చిన భర్త
కొందరు భర్తలు తమ మాట వినని భార్యలపై వివిధ రకాలుగా ప్రతీకారం తీర్చుకుంటుంటారు. విడాకులు ఇచ్చినప్పటికీ ఆ భార్య భరణం చెల్లించాల్సిందేనంటూ కోర్టుకెక్కింది. దీంతో 890 కేజీల బరువున్న 10,500 డాలర్లను భరణం కి
కొందరు భర్తలు తమ మాట వినని భార్యలపై వివిధ రకాలుగా ప్రతీకారం తీర్చుకుంటుంటారు. విడాకులు ఇచ్చినప్పటికీ ఆ భార్య భరణం చెల్లించాల్సిందేనంటూ కోర్టుకెక్కింది. దీంతో 890 కేజీల బరువున్న 10,500 డాలర్లను భరణం కింద ఇచ్చాడు. తొలుత ఈ నాణేలను స్వీకరించేందుకు ఆమె నిరాకరించినప్పటికీ.. ఆ తర్వాత వాటిని స్వీకరించక తప్పలేదు. ఇండోనేషియా రాజధాని జకర్తాలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
ఇండోనేషియాకు చెందిన డ్వి సుసిలార్టో - హెర్మి సెత్యోవాటి అనే దంపతులు ఉన్నారు. వీరిమధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా విడాకుల కోసం కోర్టుకెక్కారు. ఈ కేసును విచారించిన కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. ఆ తర్వాత కోర్టు ఆదేశం మేరకు కొన్ని నెలల పాటు భరణం చెల్లిస్తూ వచ్చాడు.
అయితే, గత 9 నెలలుగా మాజీ భార్యకు సుసిలార్టో భరణం డబ్బులు చెల్లించలేక పోయాడు. దీంతో ఆమె కోర్టుకెక్కింది. ఈ విషయ తెలుసుకున్న సుసిలార్టో మరింత ఆగ్రహం చెంది.. ఎలాగైనా ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుని ఓ వింత నిర్ణయం తీసుకున్నాడు.
తాను చెల్లించాల్సిన భరణం మొత్తం 10500 డాల్లరు (సుమారుగా రూ.7,33,586)ను నాణేల రూపంలో సేకరించాడు. ఈ నాణేల బరువు 890 కేజీలు. ఈ మొత్తాన్ని కోర్టుకు తీసుకెళ్లి జడ్జి సమక్షంలో మాజీ భార్య తరపు న్యాయవాదికి అందజేశాడు. వీటిని చూడగానే ఆ లాయర్‌కు చిర్రెత్తుకొచ్చింది. సుసిలార్టోతో కోర్టులోనే జడ్జి ముందే వాగ్వాదానికి దిగారు. అన్ని కాయిన్లను లెక్కబెట్టలేక ఆ లాయర్.. సుసిలార్టోను కొట్టినంత పనిచేశాడు.
దీనిపై సుసిలార్టో స్పందిస్తూ, 'చిన్న ఉద్యోగం చేసుకొనే తాను అంత డబ్బును ఒకేసారి ఇవ్వలేక... తన స్నేహితులను సాయం చేయాల్సిందిగా కోరాను. వాళ్లంతా తనకు కాయిన్ల రూపంలోనే ఆ మొత్తం ఇచ్చారని, అందుకే తనకు మరో దారి లేక అదే డబ్బును భరణంగా ఇచ్చినట్లు చెప్పాడు. అంతేగానీ, తన మాజీ భార్యను అవమానించాలన్న ఉద్దేశంతో ఇవ్వలేదని చెప్పాడు.
అతని వాదనతో ఏకీభవించిన కోర్టు.. ఆ నాణేలను లెక్కించేందుకు కోర్టు సిబ్బందిని నియమించింది. ఆ డబ్బును తీసుకోవడానికి మొదట్లో అతని మాజీ భార్య అంగీకరించకపోయినా తర్వాత మరో దారి లేక తీసుకుంది.