శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (11:35 IST)

డొనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చిన మరో న్యాయస్థానం... స్టే ఎత్తివేతకు ససేమిరా

అమెరికాలోకి ప్రవేశించకుండా ఏడు ముస్లిం దేశాల పౌరులపై నిషేధాజ్ఞలు విధించిన ఆ దేశ కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు మరో యుఎస్ కోర్టు తేరుకోలేని షాకిచ్చింది. తానిచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆదేశాలపై సియాటెల్ న

అమెరికాలోకి ప్రవేశించకుండా ఏడు ముస్లిం దేశాల పౌరులపై నిషేధాజ్ఞలు విధించిన ఆ దేశ కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు మరో యుఎస్ కోర్టు తేరుకోలేని షాకిచ్చింది. తానిచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆదేశాలపై సియాటెల్ న్యాయస్థానం ఇచ్చిన స్టే ఆర్డర్‌ను తొలగించాలని కోరుతూ, శాన్ ఫ్రాన్సిస్కో కోర్టును ట్రంప్ సర్కారు అశ్రయించగా అక్కడ చుక్కెదురైంది. 
 
సియాటెల్ కోర్టు ఆదేశాలను తాము నిలిపివేయలేమని, ఈ విషయంపై పూర్తి స్థాయి విచారణ జరగాల్సి వుందని స్పష్టం చేసింది. వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అంతకుముందు ప్రభుత్వం తన వాదన వినిపిస్తూ, దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని అధ్యక్షుడు నిర్ణయాలు తీసుకునే విశేషాధికారాన్ని కలిగివుంటారని, ఆయన ఉత్తర్వులను నిలిపివేస్తే, తప్పుడు సంకేతాలు వెళతాయని పేర్కొంది. వెంటనే స్టే ఆదేశాలను తొలగించాలని కోరగా, అందుకు న్యాయమూర్తి అంగీకరించలేదు.