శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 5 జనవరి 2019 (10:57 IST)

14 సంవత్సరాల పాటు కోమాలో వున్న మహిళ గర్భం దాల్చింది..

అమెరికాలో 14 సంవత్సరాల పాటు కోమాలో వున్న ఓ మహిళ గర్భం దాల్చిన వ్యవహారం సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని అరిసోనా ప్రావిన్స్‌కు చెందిన ఓ మహిళ ప్రమాదంలో చిక్కుకుని 14 సంవత్సరాల పాటు కోమాలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ నేపథ్యంలో.. ఆమెకు జరిపిన వైద్య పరీక్షల్లో కోమాలో వున్న ఆ మహిళ గర్భం దాల్చినట్లు తేలింది. 
 
అంతేగాకుండా ఆమె ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆ మహిళ బంధువులు షాకయ్యారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆస్పత్రి సిబ్బంది వద్ద విచారణ జరుపుతున్నారు.