శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 2 జూన్ 2017 (04:30 IST)

ఎన్ని దేశాలు ఛీకొడుతున్నా బుద్ధి రాని పాక్: మీరూ వద్దు, మీ క్రికెట్ వద్దు అన్న ఆప్ఘాన్

ప్రపంచానికి ఉగ్రవాదాన్ని సప్లయ్ చేస్తున్న ప్రధాన సరఫరాదారు పాకిస్తాన్ మాడు పగిలింది. అతి చిన్న దేశాలు సైతం ఛీత్కరిస్తున్నా పాక్ బుద్ధి మారలేదు. పాకిస్థాన్‌ జట్టుతో తలపెట్టిన స్నేహపూర్వక మ్యాచులను రద్దు చేస్తున్నామని, అలాగే గతంలో ఉమ్మడి క్రికెట్‌ సంబం

ప్రపంచానికి ఉగ్రవాదాన్ని సప్లయ్ చేస్తున్న ప్రధాన సరఫరాదారు పాకిస్తాన్ మాడు పగిలింది. అతి చిన్న దేశాలు సైతం ఛీత్కరిస్తున్నా పాక్ బుద్ధి మారలేదు. పాకిస్థాన్‌ జట్టుతో తలపెట్టిన స్నేహపూర్వక మ్యాచులను రద్దు చేస్తున్నామని, అలాగే గతంలో ఉమ్మడి క్రికెట్‌ సంబంధాల కోసం గతంలో చేసుకున్న ఒప్పందాల నుంచి కూడా బయటకు వస్తున్నామని అఫ్ఘానిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (ఏసీబీ) ట్విట్టర్‌లో స్పష్టం చేసింది. అఫ్ఘానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో జరిగిన తాజా ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఆ దేశ క్రికెట్‌ బోర్డు తీవ్ర నిర్ణయాన్ని తీసుకుంది. పొరుగుదేశం పాకిస్థాన్‌తో క్రికెట్‌ సంబంధాలను పూర్తిగా తెగదెంపులు చేసుకుంది. 
 
బుధవారం కాబూల్‌లోని అత్యంత సున్నితమైన దౌత్యప్రాంతంలో జరిగిన భారీ బాంబు పేలుడులో 90మందికిపైగా మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో వందలాది మంది గాయపడ్డారు. ఈ పేలుడుకు సూత్రధారి పాకిస్థాన్‌లోని హక్కానీ నెట్‌వర్క్‌యేనని, పాక్‌ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ సహకారంతో ఈ దుర్మార్గానికి పాల్పడిందని అఫ్ఘాన్‌ జాతీయ సెక్యూరిటీ డైరెక్టరేట్‌ (ఎన్డీఎస్‌) స్పష్టం చేసింది.  
 
కాబూల్‌లోని జర్మనీ, ఇరాన్‌ ఎంబసీలకు అత్యంత సమీపంలో జరిగిన ఈ పేలుడు వెనుక పాక్‌ హస్తముందని తేలడంతో ఆ దేశంతో ఇక క్రికెట్‌ ఆడకూడదని ఏసీబీ నిర్ణయం తీసుకుంది. నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయిన పాకిస్తాన్ నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అనే చందాన తమాషా చూస్తుండటం గమనార్హం.