బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 26 డిశెంబరు 2016 (14:02 IST)

వాజ్‌పేయి మన మధ్య లేరని నాలుక్కరుచుకున్న శకుంతలా భారతి

డిసెంబర్ 25న మాజీ ప్రధాని, బీజేపీ సీనియర్ నేత అటల్ బిహారీ వాజ్ పేయికి పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో సుపరిపాలనతో వాజ్ పేయ్‌కి మంచిపేరొచ్చిందన్నారు ప్రధాని మోడీ. వాజ్ పేయి 92వ పుట్టిన రోజు సందర్భంగా విషెస్

డిసెంబర్ 25న మాజీ ప్రధాని, బీజేపీ సీనియర్ నేత అటల్ బిహారీ వాజ్ పేయికి పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో సుపరిపాలనతో వాజ్ పేయ్‌కి మంచిపేరొచ్చిందన్నారు ప్రధాని మోడీ. వాజ్ పేయి 92వ పుట్టిన రోజు సందర్భంగా విషెస్ చెప్పారు నరేంద్ర మోడీ, అమిత్ షా. ఢిల్లీలోని ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బీజేపీ కార్యకర్తగా ఉన్నప్పటి నుంచి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ట్విట్టర్‌లో వాజ్ పేయ్ తో కలిసి ఉన్న వీడియోను మోడీ షేర్ చేశారు. 
 
అయితే మరోవైపు బీజేపీ నేత శకుంతలా భారతి మాత్రం వాజ్ పేయిపై నోరు జారారు. గతంలో కూడా ఈమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ నిర్వహిస్తున్న క్యాంటీన్‌లో బీఫ్ వడ్డిస్తున్నారని, ఈ యూనివర్సిటీ అధికారులు ఓ ఆవును చంపి, ఒక ఆలయాన్ని కూల్చివేశారని కూడా ఈమె అన్నారు. తాజాగా వాజ్ పేయి మనమధ్య లేరని అలీఘర్ మేయర్ శకుంతలా భారతి షాకింగ్ కామెంట్ చేశారు. భారత మాజీ ప్రధాని వాజ్ పేయిగారు మనమధ్య లేరు..కానీ ఆయన జ్ఞాపకాలు ఉన్నాయి అని ఆమె అన్నారు. కానీ వెంటనే తేరుకున్న  శకుంతలా భారతి నాలుక్కరుచుకున్నారు.
 
తనెలా ఆమాట అన్నదో తనకే తెలియదని, పొరబాటు జరిగి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నానని శకుంతలా భారతి వ్యాఖ్యానించారు. వాజ్ పేయి ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు.