శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 8 ఆగస్టు 2017 (23:24 IST)

హైదరాబాదులో అమెరికా 'షాడో అధ్యక్షురాలు' పర్యటన... ఎవరు?

ఆసక్తికరమే అయినా ఇది నిజం. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు అమెరికా అధ్యక్షుని కుమార్తె ఇవాంకా ట్రంప్ రానున్నారు. ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంలో భారతదేశంలో జరిగే ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు హాజరు కావాలని కోరారు.

మోదీ విన్నపానికి డోనాల్డ్ ట్రంప్ అంగీకరించి తన కుమార్తెను పంపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె మొదటిసారిగా హైదరాబాద్ నగరానికి రానున్నారు. కాగా ఈమెను అమెరికాలోని విమర్శకులు అమెరికా షాడో అధ్యక్షురాలు అని చమత్కరిస్తుంటారు. 
 
ఎందుకంటే ట్రంప్ తను అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్టించిన తర్వాత అనూహ్యంగా తన కుమార్తెకు పాలనా వ్యవహారాల్లో పెద్దపీట వేసి కొన్ని బాధ్యతలు అప్పగించారు. కాగా ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ పర్యటన వచ్చే నవంబరులో నెలలో వుంటుందని చెపుతున్నారు.