శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By కుమార్ దళవాయి
Last Updated : శుక్రవారం, 15 మార్చి 2019 (17:41 IST)

అమెరికాతో చతురు కాదు... అలా చేసి యుద్ధంలో జయించగలదు...

రెండు దేశాల మధ్య యుద్ధం ఏర్పడితే పరస్పరం ఆయుధాలను, సాంకేతిక నైపుణ్యాలను, క్షిపణులు, జలాంతర్గాములను ఉపయోగించి పోరాడి ఏదో ఒక దేశం గెలుపొందడం సహజం. కానీ శత్రు దేశంలో వాతావరణాన్ని వారికి ప్రతికూలంగా చేసి శత్రు దేశాన్ని యుద్ధమే చేయనీయకుండా కట్టడి చేసి గెలుపొందిన దేశాలు కూడా ఉన్నాయి. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా ఇది నిజం.
 
1955 నుండి 1975 మధ్య అమెరికాకు వియత్నాంకు మధ్య భీకర యుద్ధం జరిగింది. అయితే 1967 సంవత్సరం వియత్నాంలో యుద్ధ సమయంలో సాధారణ వర్షాకాలం వచ్చింది. ఈ సమయంలో వాతావరణం అనుకూలించక వియత్నాం యుద్ధాన్ని ఆపేయాల్సి వచ్చింది. అయితే వర్షాకాలం పూర్తయి నెలలు, సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా అక్కడ వర్షం ఆగకపోవడంతో వారికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. యుద్ధ వాహనాలు, విమానాలు సైనికులు ఎక్కడికీ కదలలేని పరిస్థితి. అయితే ఈ వర్షం కురవడానికి కారణం శత్రు దేశం అమెరికా.
 
అమెరికా ప్రభుత్వం అత్యంత రహస్యంగా వ్యూహం రచించి 'ఆపరేషన్ పపాయ' చేపట్టింది. దీని ప్రధాన ఉద్దేశం శత్రు దేశంలో వాతావరణ పరిస్థితులను వారికి ప్రతికూలంగా చేసి వారిని ఓడించడం. ప్రపంచంలోనే మొట్టమొదటగా వాతావరణాన్ని అస్త్రంగా చేసుకుని శత్రువులపై విజయం సాధించిన దేశం అమెరికా. ఇది జరిగిన కొన్ని సంవత్సరాలకు ఐక్యరాజ్యసమితి ఇలా వాతావరణంలో మార్పులకు కారణమయ్యే సాంకేతికతను యుద్ధంలో వినియోగించకూడదని చట్టం తీసుకొచ్చింది.