శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 4 మార్చి 2019 (09:57 IST)

భారత మెరుపు దాడుల్లో జైషే చీఫ్ మసూజ్ అజర్ మృతి?

జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ మరణంపై భిన్న కథనాలు వినొస్తున్నాయి. గత నెల పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని జేషే ఉగ్రతండాలపై భారత వైమానికదళం జరిపిన మెరుపుదాడుల్లో తీవ్రంగా గాయపడిన అజర్.. పాకిస్థాన్ ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు సమాచారం. ఇది ఒక కథనం. 
 
మరోవైకథనం ఏంటంటే... గత కొన్ని రోజులుగా కిడ్నీలు పాడైపోవడంతో డయాలసిస్ చేయించుకుంటూ వచ్చిన అజర్.. తాజాగా మరణించినట్టు సమాచారం. దీనిపై పాక్ ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మసూద్ మరణించాడన్న వదంతుల నేపథ్యంలో జైషే మహమ్మ ద్ ఆదివారం ఓ ప్రకటన చేస్తూ .. మసూద్ బతికే ఉన్నాడని, అతడి ఆరోగ్యం బాగానే ఉన్నదన్నది.
 
మరోవైపు మసూద్ మరణ వార్తలు నిజమా కాదా అని తెలుసుకునేందుకు భారత నిఘా సంస్థలు ప్రయత్నిస్తున్నాయని అధికార వర్గాలు చెప్పాయి. మసూద్ పాకిస్థాన్‌లోనే ఉన్నాడని, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి నుంచి బయటకు రాలేని స్థితిలో ఉన్నాడని పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. 
 
మసూద్‌కు వ్యతిరేకంగా భారత్ బలమైన ఆధారాలు సమర్పిస్తే అతడిపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఐఏఎఫ్ దాడుల్లో జైషేకు ఏ మేరకు నష్టం వాటిల్లిందో ఆధారాలు చూపాలని అన్ని వైపుల నుంచి ఒత్తిడులు వస్తున్న నేపథ్యంలో కేంద్రం త్వరలోనే ఆధారాలు బయటపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఆధారాలు బయటపెట్టాలా? వద్దా? అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందని ఐఏఎఫ్ ప్రకటించింది.