శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2017 (12:28 IST)

ఆ వ్యక్తికి పాము చుక్కలు చూపించింది.. ముఖంపై కాటేసింది.. చివరికి?

పాములు పట్టే వ్యక్తికి ఆ పాము చుక్కలు చూపించింది. చావు అంచుల వరకు తీసుకెళ్లింది. ఈ క్రమంలో విషసర్పం అతడి ముఖంపై కాటేసినా అదృష్టవశాత్తూ అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన అమెరికాలోని అరిజోనోలో చోటుచేసుకు

పాములు పట్టే వ్యక్తికి ఆ పాము చుక్కలు చూపించింది. చావు అంచుల వరకు తీసుకెళ్లింది. ఈ క్రమంలో విషసర్పం అతడి ముఖంపై కాటేసినా అదృష్టవశాత్తూ అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన అమెరికాలోని అరిజోనోలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.... అరిజోనాలోని ఫోనిక్స్ నగరంలో విక్టర్ ప్రాట్ అనే 40 ఏళ్ల వ్యక్తి నివాసం ఉండేవాడు. కొన్నిరోజుల క్రితం తన కుమారుని పుట్టిన రోజు వేడుక  కోసం సన్నిహితులను, స్నేహితులను, బంధువులను ఆహ్వానించాడు. 
 
రిక్టర్‌కు చిన్నప్పటి నుంచి పాములు పట్టడం అలవాటు. వాటితో ఆడుకోవటం అతనికి అలవాటేనని గొప్పలు చెప్పుకునేవాడు. పాములను పట్టడమే కాదు వాటితో వంటకాలు కూడా రిక్టర్ చేస్తాడు. తాను విషసర్పాలతో ఆడుకుంటామని ఓవరాక్షన్ చేశాడు. అంతేగాకుండా.. ఓ విషసర్పాన్ని చేతిలో పట్టుకుని ఆటలు మొదలుపెట్టాడు. కొంత సమయం తర్వాత ఆ పాము అకస్మాత్తుగా రిక్టర్ ముఖంపై కాటేయడంతో స్పృహకోల్పోయాడు. 
 
అతడ్ని స్థానిక బానర్ యూనివర్సిటీ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కొన్ని రోజులపాటు డాక్లర్లు చేసిన శ్రమ ఫలించి రిక్టర్ మామూలు మనిషయ్యాడు. పాముకాటేసినా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.