శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 28 మార్చి 2020 (18:55 IST)

భారత్​లోని అమెరికన్లను తరలించేందుకు సన్నాహాలు

లాక్​డౌన్​ కారణంగా భారత్​లో చిక్కుకున్న అమెరికన్లను తరలించే ఏర్పాట్లు చేస్తోంది అమెరికా. ప్రత్యేక విమానాల సాయంతో దాదాపు 2000 మందిని స్వదేశానికి చేర్చేందుకు యత్నిస్తోంది.

భారత్​లో చిక్కుకున్న దాదాపు 2వేల మంది అమెరికా పౌరులను విమానాల ద్వారా స్వదేశానికి తరలించేందుకు సిద్ధమైంది యూఎస్​ ప్రభుత్వం. భారత్​లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్​డౌన్​ విధించింది ప్రభుత్వం.

అంతర్జాతీయ రాకపోకలు నిలిపివేసింది. దీంతో భారత్​లో వేలాది మంది విదేశీ పర్యటకులు హోటల్​ గదులకే పరిమితమయ్యారు.

ఇందులో దాదాపు 2వేల మంది అమెరికన్లూ ఉన్నారు. దాదాపు 1500 మంది అమెరికన్లు దిల్లీలో, 700 మంది ముంబయిలో చిక్కుకున్నారు.

4 వందలకు పైగా అమెరికా వాసులు ఇతర రాష్ట్రాల్లో ఇరుక్కుపోయారని ప్రకటించింది అమెరికా దౌత్య కార్యాలయం. అందుకే వారిని, ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.