కరోనా వైరస్ గుప్పిట్లో ఇరాన్, భారతీయుల కోసం ప్రత్యేక ఫ్లైట్
కరోనా బాధితుల కోసం విమానం
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్... చైనా తర్వాత అత్యధిక ప్రభావిత దేశాల్లో ఇరాన్ ఉంది. కరోనా వైరస్ బారినపడిన అధిక ప్రభావిత దేశాల్లో ఇరాన్ ఉంది. అయితే, ఇక్కడ రెండు వేల మంది భారతీయులు చిక్కుకునివున్నారు. వీరిని రక్షించేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు చేపట్టింది.
ముఖ్యంగా, వీరిని స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని పంపింది. తొలి విడతగా 58 మంది భారతీయులను తీసుకుని ఐఐఎఫ్ విమానం ఇండియాకు చేరుకుంది. గజియాబాద్ ఎయిర్ పోర్టులో కొద్దిసేపటి క్రితం ల్యాండ్ అయ్యింది.
ఈ విమానంలో వచ్చిన వారందరికీ తొలుత స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక డాక్టర్ల బృందం ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అటు భారతీయుల తరలింపునకు సహకరించిన ఇరాన్ అధికారులకు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కృతజ్ఞతలు చెప్పారు.