శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 మార్చి 2020 (14:49 IST)

113 దేశాలకు వ్యాపించిన కరోనా.. మృతులు 4009 పైమాటే...

ప్రపంచ వ్యాప్తంగా 113 దేశాలకు కరోనా వైరస్‌ పాకింది. కరోనా వైరస్‌ మృతుల సంఖ్య 4009కి చేరింది. ఇప్పటివరకు 1,14,285 మంది వైరస్‌ బారిన పడ్డారు. ఇటలీలో సోమవారం ఒక్కరోజే 97 మంది మృతి చెందగా, 1797 కేసుల నమోదయ్యాయి. చైనాలో కొత్తగా మరో నాలుగు కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు. 
 
ప్రాణాలు తీసిన వదంతులు 
ఇరాన్‌లో వదంతులు ప్రాణాలు తీశాయి. మద్యంతో కరోనా తగ్గిపోతుందంటూ ప్రచారం చేశారు. దీంతో నాటు సారా తాగి 27 మంది మృతి చెందారు. మరో 218 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కరోనా వైరస్‌తో ఇరాన్‌ అతలాకుతలమైపోతుంది. 
 
మంగళవారం ఒక్కరోజే కరోనా వైరస్‌తో 43 మంది మృతి చెందారు. ఇరాన్‌లో మంగళవారం ఒక్కరోజే 595 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఇరాన్‌లో 237 మంది మృతి చెందారు. మరో ఏడు వేల మందికి కరోనా వైరస్‌ సోకింది. 
కరోనా ప్రభావం ఖైదీలపై ఉండటంతో 70 వేల మంది ఖైదీలను ఇరాన్‌ ప్రభుత్వం విడుదల చేసింది.