శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 9 మార్చి 2020 (15:08 IST)

#CoronavirusOutbreak సెన్సెక్స్ ఢమాల్: 10 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి

సెన్సెక్స్
కరోనా దెబ్బకు ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎన్నడూ చూడని విధంగా నష్టాల బాటలో పయనిస్తోంది. సెన్సెక్స్ 2000 పాయింట్ల భారీ పతనాన్ని చవిచూస్తుండటంతో సూచీ 35 వేల దగ్గరకి చేరింది. మరోవైపు నిఫ్టీ 600 పాయింట్ల మేర నష్టాన్ని చవిచూసింది. ఈ కారణంగా ఈరోజు దాదాపు 10 లక్షల కోట్ల మదుపుదారుల సంపద ఆవిరైపోయిందని నిపుణులు చెపుతున్నారు. 
 
చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ కోరలు ప్రపంచ దేశాలకు పాకుతూ వుండటం మూలంగా సెన్సెక్స్ సూచీ నేలచూపులు చూస్తోందని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 102 దేశాలు కరోనా బారిన పడ్డాయి. మరోవైపు అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోయాయి. ఇదంతా ఉలావుంటే యస్ బ్యాంకు సంక్షోభం భారతదేశాన్ని కుదిపేస్తోంది. ఇలా, ఒకటి కాదు ఎన్నో కారణాలన్నీ కలిసి సెన్సెక్స్ పతనానికి కారణమయ్యాయి.