శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (10:43 IST)

కుదేలైన స్టాక్ మార్కెట్లు- నిమిషాల వ్యవధిలో లక్షల కోట్ల నష్టం

స్టాక్ మార్కెట్లు కుదేలైనాయి. భారత స్టాక్ మార్కెట్లో మరో బ్లాక్ ఫ్రైడే నమోదైంది. నిమిషాల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపదంతా ఆవిరైపోయింది.

కరోనా భయాలు ప్రపంచ జీడీపీని కుదేలు చేయనున్నాయని వచ్చిన వార్తలకు తోడు, మరిన్ని దేశాలకు వైరస్ వ్యాపించిందన్న వార్తలు, ఆసియా మార్కెట్లను కుదేలు చేసింది. దీంతో సెషన్ ఆరంభంలోనే బెంచ్ మార్క్ సూచికలు భారీగా నష్టపోయాయి.
 
ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం మార్కెట్ ప్రారంభమైన నిమిషాల్లోనే సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోయింది. అన్ని సెక్టోరల్ ఇండెక్స్ ల్లోని కంపెనీల ఈక్విటీలను విక్రయించేందుకే ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. ఈ ఉదయం 10.20 గంటల సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్ 1104 పాయింట్లు పడిపోయి 38,641 పాయింట్లకు చేరింది.