బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 నవంబరు 2019 (14:42 IST)

సెన్సెక్స్ అదుర్స్.. ఐదు నెలల గరిష్ఠానికి నిఫ్టీ.. ఇన్ఫోసిస్ టాప్

నిర్మాణ రంగానికి ఊతమిచ్చేలా కేంద్రం, ఆర్బీఐలు చర్యలు చేపడతాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన ప్రకటనతో రియల్‌ఎస్టేట్‌ షేర్లు పరుగులు పెట్టాయి. కొనుగోళ్ల జోరుతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది. 
 
రియల్టీ షేర్లు ఇండియా బుల్స్‌, శోభా, ప్రెస్టిజ్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్సు షేర్లు 5 శాతం వరకూ లాభపడ్డాయి. మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మధ్యాహ్నం 2.40 గంటల సమయానికి 326 పాయింట్ల లాభంతో 40,574 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 79.70 పాయింట్లు పెరిగి 11,996 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 
 
ఫలితంగా ఐదు నెలల గరిష్ఠ స్థాయికి నిఫ్టీ చేరుకుంది. 12వేల మార్కును నిఫ్టీ ఐదు నెలల తర్వాత చేరుకోవడం ఇదే తొలిసారి. బ్యాంకింగ్ షేర్లు, ఇన్ఫోసిస్ టాప్ గెయిన్ కంపెనీగా బుధవారం నిలిచింది.