బుధవారం, 6 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Modified: గురువారం, 10 అక్టోబరు 2019 (18:24 IST)

06-10-2019 నుంచి 12-10-2019 వరకు మీ రాశి ఫలితాలు..

మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆహ్వానం అందుతుంది. అయినవారితో ఉల్లాసంగా గడుపుతారు. కార్యసాధనలో జయం, ధనలాభం. అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పరిచయాలు బలపడతాయి. గృహం సందడిగా ఉంటుంది. పనులు హడావుడిగా సాగుతాయి. మంగళ, బుధ వారాల్లో నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అపరిచితులను నమ్మవద్దు. అవగాహనలేని విషయాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. సంతానం దూకుడు అదుపు చేయండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ఉపాధి పథకాల్లో రాణిస్తారు. కళ, క్రీడాకారులను ప్రోత్సాహకరం.
 
వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు.
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి సారిస్తారు. సంప్రదింపులకు అనుకూలం. గురు, శుక్ర వారాల్లో ఆచూతూచి వ్యవహరించాలి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను విశ్వసించవద్దు. నగదు, పత్రాలు జాగ్రత్త. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. పెట్టుబడులకు అనుకూలం. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉపాథి శిక్షణ లభిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. వాహన చోదకులకు సమస్యలెదురవుతయి.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు. 
సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వ్యవహారాల్లో మీదే పై చేయి. ఎంతటివారినైనా ఆకట్టుకుంటారు. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు అధికమవుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. శని, ఆది వారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. విలాసాలకు వ్యయం చేస్తారు. స్థిరాస్తి కొనుగోలులో పునరాలోచన అవసరం. తొందరపాటుతనం తగదు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. దంపతుల మధ్య దాపరికం తగదు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు. ఆహ్వానం అందుతుంది. ఆత్మీయులను కలుసుకుంటారు. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణం కలిసివస్తుంది.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష.
గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. సోమ, మంగళ వారాల్లో దంపతుల మధ్య అవగాహన లోపం. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణ సమస్యలు కొలిక్కి వస్తాయి. మానసికంగా కుదుట పడతారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఒక ఆహ్యానం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దైవదర్శనంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కళాకారులకు ప్రోత్సాహకరం.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం.
ప్రేమానుబంధాలు బలపడతాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. గృహం సందడిగా ఉంటుంది. పనులు సానుకూలమవుతాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పదవులు దక్కకపోవచ్చు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. బుధవారం నాడు కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. ఊహించని సంఘటనలెదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. దీక్షలు స్వీకరిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెద్దమొత్తం నగదుతో ప్రయాణం తగదు. వేడుకల్లో పాల్గొంటారు.
 
కన్యారాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. 
కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. అవకాశాలు చేజారిపోతాయి. నిస్తేజానికి లోనవుతారు. మనస్థిమితం ఉండదు. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. సన్నిహితుల హితువు మీపై మంచి ప్రభావం చూపుతుంది. ఖర్చులు సామాన్యం. దంపతుల మధ్య అవగాహన లోపం. ఆశావహ దృక్పథంతో మెలగాలి. వ్యాపకాలు సృష్టించుకోండి. అతిగా ఆలోచింపవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. గురు, శుక్ర వారాల్లో పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధకం.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు.
రుణ ఒత్తిళ్లు అధికం. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. సాయం అడిగేందుకు మనస్కరించదు. శనివారం నాడు ప్రతికూలత లెదురవుతాయి. సంప్రదింపులు ఫలించవు. ప్రతి చిన్న విషయం ఆందోళన కలిగిస్తుంది. పనుల ప్రారంభంలో ఆటంకాలెదుర్కుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఓర్పుతో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పరిచయంలేని వారితో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట.
ఈ వారం ఉత్సాహంగా గడుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. పదవుల స్వీకరణకు అనుకూలం. కొత్త పరిచయాలేర్పడతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. బంధువులతో సంబంధాలు బలపడతాయి. అవకాశాలు కలిసివస్తాయి. మీ జోక్యం అనివార్యం. ఆత్మీయులకు సాయం అందిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఖర్చులు విపరీతం. ధనానికి లోటుండదు. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పురస్కారాలు అందుకుంటారు. వృత్తుల వారికి సామాన్యం. కోర్టు వ్యవహారాలు విచారణకు రాగలవు. 
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. 
పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. వ్యవహారానుకూలత ఉంది. మనోధైర్యంతో ముందుకు సాగండి. సలహాలు, సాయం ఆశించవద్దు. అభియోగాలకు దీటుగా స్పందిస్తారు. పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. వాగ్వాదాలకు దిగవద్దు. ప్రముఖులను కలుసుకుంటారు. సమస్యలు సద్దుమణుగుతాయి. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెంపొందుతుంది. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి. ప్రయాణం విరమించుకుంటారు.
 
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు.
వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ధనలాభం ఉంది. పనులు వేగవంతమవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. బాధ్యతలు స్వీకరిస్తారు. హామీలివ్వవద్దు. నగదు, వస్తువులు జాగ్రత్త. ఆది, సోమ వారాల్లో బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం క్షేమం కాదు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఊహించని సంఘటనలెదురవుతాయి. కార్యక్రమాలు ముందుకు సాగవు. వ్యాపారాల్లో రాణింపు. అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తు కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు.
మనోధైర్యంతో ముందుకు సాగండి. సన్నిహితులను కలుసుకుంటారు. ఒక సమస్యకు తాత్కాలిక పరిష్కారం లభిస్తుంది. ఖర్చులు అధికం. ఆర్థికస్థితి సామాన్యం. రుణ ఒత్తిళ్ళు అధికం. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనులు ముగింపు దశలో హడావుడిగా సాగుతాయి. పత్రాల రెన్యువల్‌‌లో మెలకువ వహించండి. అనవసర జోక్యం తగదు. మంగళ, బుధ వారాల్లో మీ గౌరవానికి భంగం కలిగే సూచనలున్నాయి. దంపతుల మధ్య సఖ్యత లోపం. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నష్టాలు, ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దీక్షలు స్వీకరిస్తారు. 
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం. ఉత్తరాభాద్ర, రేవతి.
ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. శకునాలను పట్టించుకోవద్దు. లక్ష్యసాధనకు కృషి పట్టుదల ప్రధానం. సహాయం ఆశించవద్దు. స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. గురు, శుక్ర వారాల్లో నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. బంధుమిత్రులు మీ వైఖరిని తప్పుపడతారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆత్మీయులను కలుసుకుంటారు. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం తగదు. ఉద్యోగస్తులకు అడ్వాన్స్‌‌లు మంజూరవుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. వేడుకల్లో పాల్గొంటారు.