శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : శనివారం, 31 ఆగస్టు 2019 (16:48 IST)

01-09-2019 నుంచి 07-09-2019 వరకు మీ రాశి ఫలితాలు..

మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. కష్టానికి ప్రతిఫలం అందుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఆది, సోమవారాల్లో పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సంతానం విషయంలో శుభసంకేతాలున్నాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. నిర్మాణాలు వేగవంతమవుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. భాగస్వామిక చర్చలు కొలిక్కి వస్తాయి. ఉపాధ్యాయులు పురస్కారాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. అధికారులకు పనిభారం, విశ్రాంతి లోపం. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. జూదాలు, బెట్టింగ్‌ల జోలికి పోవద్దు.
 
వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు.
వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. అంచనాలు ఫలిస్తాయి. ఆత్మీయులకు సాయం అందిస్తారు. బంధుత్వాలు బలుపడతాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. పనులు సకాలంలో పూర్తి కాగలవు. నగదు స్వీకరణ, చెల్లింపుల్లో జాగ్రత్త. మంగళ, బుధ వారాల్లో ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పరిచయాలు, వ్యాపకాలు విస్తృతమవుతాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. ఊహించని సంఘటనలెదురవుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. స్పెక్యులేషన్ రంగాల వారికి ఆశాజనకం.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు. 
అన్ని రంగాల వారికి శుభయోగమే. దీర్ఘకాలిక సమస్యలు కొలిక్కి వస్తాయి. ఆందోళన తొలగి కుదుటపడతారు. ఖర్చులు విపరీతం. దైవకార్యాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. గృహమార్పు కలిసివస్తుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. గురు, శుక్ర వారాల్లో ప్రత్యర్థులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరు వ్యాపారులకు ఆశాజనం. ఉపాధ్యాయులు ప్రశంసలు అందుకుంటారు. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. అధికారులకు హోదా మార్పు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు. ప్రయాణం కలిసివస్తుంది. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష.
మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. ధనలాభం ఉంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. చేతిలో ధనం నిలవదు. కొత్త పనులు ప్రారంభిస్తారు. గృహమార్పు కలిసివస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయంలో పునరాలోచన మంచిది. శుక్ర, శని వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రముఖులను కలుసుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు. వాహన చోదకులకు దూకుడు తగదు. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం.
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ధనసమస్యలెదురవుతాయి. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబీకుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. గృహమార్పు అనివార్యం. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతారు. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. కాంట్రాక్టులు, ఏజెన్సీలు దక్కించుకుంటారు.
 
కన్యారాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. 
వ్యవహారానుకూలత అంతంత మాత్రమే. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. దుబారా ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. సోమ, మంగళ వారాల్లో పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఈ ఇబ్బందులు తాత్కాలికమేనని గమనించండి. పరిస్థితులు త్వరలో చక్కబడతాయి. ఆశావహ దృక్పథంతో యత్నాలు సాగించండి. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం దూకుడు అదుపు చేయండి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉపాధ్యాయుల సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. అధికారులకు ధనప్రలోభం తగదు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. 
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు.
ధనలాభం ఉంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. అనుకూలతలున్నాయి. పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. బంధువులతో సంబంధాలు బలపడతాయి. ఆత్మీయులకు సాయం అందిస్తారు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. పట్టుదలతో యత్నాలు సాగించండి. పరిచయంలేని వారితో జాగ్రత్త. బుధవారం నాడు వ్యవహారాలతో హడావుడాగా ఉంటారు. ఒత్తిడి, ప్రలోభాలకు లొంగవద్దు. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా వ్యక్తం చేయండి. వ్యాపారాలు ఊపందుకుంటారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉపాధ్యాయులు పురస్కారాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. దైవకార్య సమావేశంలో పాల్గొంటారు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట.
పరిస్థితులు చక్కబడతాయి. ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఒత్తిడి తగ్గి కుదుటపడతారు. ఖర్చులు అధికం. ధనానికి ఇబ్బంది ఉండదు. అవసరాలు నెరవేరుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. గురు, శుక్ర వారాల్లో ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. పెట్టుబడుల సమాచారం సేకరిస్తారు. గృహమార్పు కలిసివస్తుంది. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. స్థిరాస్తి క్రయ విక్రయంలో జాగ్రత్త. తొందరపాటు నిర్ణయాలు తగవు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు.
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. 
అంచనాలు ఫలిస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. బాకీలు వసూలవుతాయి. ఖర్చులు విపరీతం. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆప్తుల సలహా పాటించండి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. శనివారం నాడు ఓర్పుతో వ్యవహరించాలి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. మీ నిజాయితీకి ప్రశంసలు లభిస్తాయి. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. ఉపాధ్యాయులకు పురస్కార యోగం. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెళకువ వహించండి. అధికారులతో జాగ్రత్త. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. నిర్మాణాలు ఊపందుకుంటారు. క్రీడా, కళాకారులకు ప్రోత్సాహకరం.
 
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు.
శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. సమర్ధతపై నమ్మకం పెంచుకోండి. యత్నాలు విరమించుకోవద్దు. ఆశావహ దృక్పథంతో ముందుకు సాగండి. సన్నిహితులు హితువు మీపై మంచి ప్రభావం చూపుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. దైవకార్యాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. సంతానం రాక ఉత్సాహం కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. అధికారులకు హోదా మార్పు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. వాహన చోదకులు దూకుడు తగదు. కోర్టు వాయిదాలు చికాకుపరుస్తాయి.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు.
ఈ వారంలో పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. వ్యవహారనుకూలత అంతంత మాత్రమే. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ధనం మితంగా వ్యయం చేయండి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. బాధ్యతగా వ్యవహరించాలి. నగదు, వస్తువులు జాగ్రత్త. ఆత్మీయుల రాక ఉత్సాహం కలిగిస్తుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. గృహంలో మార్పచేర్పులకు అనుకూలం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆరోగ్యం సంతృప్తికరం. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. సాంకేతిక, వైద్య రంగాల వారికి ఆశాజనం. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం. ఉత్తరాభాద్ర, రేవతి.
ఓర్పునేర్పులకు పరీక్షా సమయం. అవకాశాలు చేజారిపోతాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. దంపుతుల మధ్య సఖ్యత లోపం. బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. విమర్శలు పట్టించుకోవద్దు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. గృహమార్పు అనివార్యం. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు. వాహనం ఇతరులకివ్వటం క్షేమం కాదు. ప్రయాణం తలపెడతారు.