శనివారం, 25 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : శనివారం, 27 జులై 2019 (19:02 IST)

28-07-2019 నుంచి 03-08-2019 వరకు మీ వార రాశి ఫలితాలు..

మేషం : అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం 
అవకాశాలను చేజిక్కించుకుంటారు. పనులు నిదానంగా సానుకూలమవుతాయి. రుణ విముక్తులవుతారు. ఖర్చులు భారమనిపించవు. మీదైనా రంగంలో రాణింపు, సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగాస్తారు. ఏజెన్సీలు, దళారులను విశ్వసించవద్దు. పెట్టుబడుల సమాచారం సేకరిస్తారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. శనివారం నాడు అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. బంధుత్వాల బలపడతాయి. స్ధిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. 
వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. రాబోయే ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. గృహంలో స్తబ్ధత తొలుగుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆది, సోమ వారాల్లో పనులు హడావుడిగా సాగుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. అపరిచితులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. నిర్మాణాలు, మరమ్మతులు వేగవంతమవుతాయి. చెల్లింపుల్లో మెళకువ వహించండి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో స్ధిరపడతారు. నిరుద్యోగులకు  ఉద్యోగప్రాప్తి. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. రిప్రజెంటేటివ్‌లు టార్గెట్‌లను అధిగమిస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఆశాజనకం. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు.  
ప్రేమానుబంధాలు బలపడతాయి. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురుస్తాయి. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. అనుకూల పరిస్థితులున్నాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ధనానికి ఇబ్బంది ఉండదు. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. నగలు, విలువైన వస్తువులు జాగ్రత్త. మంగళ, గురు వారాల్లో బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం తగదు. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తడి, పనిభారం. అధికారులకు హోదా మార్పు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. వివాదాలు , కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష   
వ్యవహార ఒప్పందాల్లో మెళకువ వహంచండి. మీ గౌరవానికి భంగం కలిగే సూచనలున్నాయి. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. బుధవారం నాడు పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. అవకాశాలను వదులుకోవద్దు. లైసెన్సులు, పర్మిట్‌ల రెన్యువల్‌లో నిర్లక్ష్యం తగదు. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. న్యాయ, సేవా సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. దైవకార్యంలో పాల్గొంటారు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
ఆదాయానికి మించి ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. స్ధిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. శుక్ర, శని వారాల్లో ఓర్పుతో వ్యవహరించాలి. మీ తప్పిదాలను సరిదిద్దుకోవటానికి యత్నించండి. ఎవరినీ నిందించవద్దు. సంప్రదింపులకు అనుకూలం. ఎదుటి వారి ఆంతర్యం గ్రహించండి. తొందరపడి హామీలివ్వవద్దు. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. సంతానానికి ఆలస్యంగా ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆశావహ దృక్పథంతో యత్నాలు సాగించండి. దంపతుల మధ్య దాపరికం తగదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. సహోద్యోగులతో విందులు, సమావేశాల్లో పాల్గొంటారు.
 
కన్య : ఉత్తర 2, 3 4 పాదాలు. హస్త, చిత్త 1, 2 పాదాలు.  
ఈ వారం వాగ్ధాటితో నెట్టుకొస్తారు. ధనలాభం ఉంది. రుణ బాధలు తొలుగుతాయి. ఖర్చులు సామాన్యం. గృహం ప్రశాంతంగా ఉంటుంది. అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపకాలు, పరిచయాలు అధికమవుతాయి. పనులు ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. మీ శ్రీమతి వైఖరి మార్పు సంభవం. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెట్టుబడులకు అనుకూలం. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు అనుకూలం. పుణ్యకార్యంలో పాల్గొంటారు. ప్రయాణం చికాకు పరుస్తుంది.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖథ 1, 2 3 పాదాలు.  
ఆదాయం సంతృప్తికరం. అనుకున్న ఖర్చులే ఉంటాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. పనులు ప్రారంభంలో మందకొడిగా సాగుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మొహమ్మటాలకు పోవద్దు. ఆశించిన పదవులు దక్కవు. పట్టుదలతో యత్నాలు సాగించాలి. త్వరలో శుభవార్త వింటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పిల్లల ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. విద్యా ప్రకటనలను విశ్వసించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పెట్టుబడులకు అనుకూలం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారాలు ఊపందుకుంటారు. ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. వివాదాలు కొలిక్కి వస్తాయి. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు.
 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట  
ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఖర్చులు సామాన్యం. రుణయత్నం ఫలిస్తుంది. అవకాశాలు కలిసివస్తాయి. ఉల్లాసంగా గడుపుతారు. కొన్ని సమస్యల నుంచి విముక్తులవుతారు. ఆందోళన తగ్గుతుంది. సంప్రదింపులకు అనుకూలం. ఆది, మంగళ వారాల్లో పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. పత్రాలు, నగదు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. నమ్మకస్తులే మోసగించవచ్చు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. గృహనిర్మాణాలు వేగవంతమవుతాయి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. స్వల్ప అస్థవ్యస్థతకు గురవుతారు. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే అనుకూలం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. 
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం  
బంధుత్వాలు బలపడతాయి. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. ఆర్థిక సమస్యలు కొలిక్కి వస్తాయి. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ప్రణాళికలు రూపొందించుకుంటారు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. బుధ, గురు వారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుపడదు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. పెద్దల ఆరోగ్యం స్ధిరంగా ఉంటుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ప్రతి విషయం స్వయంగా చూసుకోవాలి. పర్మిట్‌లు, లైసెన్సుల రెన్యువల్‌లో మెళకువ వహించండి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొత్త సమస్యలెదురవుతాయి. దైవకార్యంలో పాల్గొంటారు.
 
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు  
సంప్రదింపులు సాగవు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఓర్పుతో వ్యవహరించాలి. యత్నాలు విరమించుకోవద్దు. సమర్ధతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. శుక్ర, శని వారాల్లో పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. అనవసర జోక్యం తగదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. అవకాశాలను వదులుకోవద్దు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. వృత్తుల వారికి సామాన్యం. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. దైవ కార్య సమావేశాల్లో పాల్గొంటారు. షేర్ల క్రయ విక్రయాలకు అనుకూలం.
 
 
కుంభం: ధనిష్ట 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు  
గృహంలో స్తబ్ధత తొలగుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఖర్చులు అంచానాలను మించుతాయి. ఆది, సోమ వారాల్లో ధనమూలక సమస్యలెదుర్కుంటారు. సాయం అర్ధించేందుకు మనస్కరించదు. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. సన్నిహితుల సాయం అందుతుంది. పనులు వేగవంతమవుతాయి. సంప్రదింపులు వాయిదా పడతాయి. మీ పై శకునాల ప్రభావం అధికం. అవివాహితుల ఆలోచనలు నిలకడగా ఉండవు. విదేశీ విద్యాయత్నం ఫలించదు. ఆశావహ దృక్పథంతో మెలుగండి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు హోదా మార్పు, స్ధానచలనం. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
పరిచయాలు, బంధుత్వాల బలపడతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపచేస్తుంది. వ్యవహారాలను సమర్ధంగా నిర్వహిస్తారు. ధనలాభం ఉంది. పనులు సానుకూలమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. పనులు హడావుడిగా సాగుతాయి. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. మంగళ, బుధ వారాల్లో నగదు పత్రాలు జాగ్రత్త. ఆరోగ్యం కుదుటపడుతుంది. పెట్టుబడులకు అనుకూలం. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. ప్రయాణం అనుకూలిస్తుంది. మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి.