'మనం సైతం'కు అండగా ఉంటా - కేటీఆర్

ktramarao
శ్రీ| Last Modified శనివారం, 27 జులై 2019 (18:54 IST)
మనం సైతం సేవా సంస్థ వ్యవస్థాపకులు కాదంబరి కిరణ్ తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల మనం సైతం సంస్థ చేపట్టిన సేవా కార్యక్రమాలను ఆయనకు వివరించారు. మనం సైతం తరపున మొక్కను, బ్రోచర్‌ను అందించారు. మీరు అనుకున్న కార్యక్రమాలు చేయండి నేను అండగా ఉంటానంటూ కేటీఆర్ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

త్వరలో మనం సైతం నిర్వహించబోయే మెగా కార్యక్రమంలో పాల్గొంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఎంతో బిజీగా ఉన్నా కలిసేందుకు సమయం ఇచ్చిన కేటీఆర్‌కు కాదంబరి కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్ మార్గదర్శనంలో మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేస్తామని కాదంబరి కిరణ్ తెలిపారు.

కాదంబరితో పాటు కేటీఆర్‌ను కలిసిన వారిలో పరుచూరి వెంకటేశ్వరరావు, వల్లభనేని అనిల్, రమేష్ రాజా, మహానందరెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, మనం సైతం సభ్యులు ఉన్నారు.దీనిపై మరింత చదవండి :