బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 ఫిబ్రవరి 2022 (18:47 IST)

భారీ వర్షాలకు కొలంబియా అతలాకుతలం.. 14మంది మృతి

భారీ వర్షాలకు కొలంబియా అతలాకుతలం అవుతోంది. కొలంబియాలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి కనీసం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 35మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కొండచరియలు విరిగిపడి బండరాళ్లు, మట్టిలో ఇళ్లు కూరుకుపోయిన ఫోటోలను అధికారులు విడుదల చేశారు. 
 
భారీ వర్షాలతో నదుల్లో ప్రవాహం ప్రమాదస్థాయిని మించడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. 
 
ఈ దుర్ఘటనపై కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందజేయాలని అధికారులను ఆదేశించారు.