గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 జనవరి 2022 (19:35 IST)

బ్రెజిల్‌లో దారుణం.. పర్వత కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి

బ్రెజిల్ దేశంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బ్రెజిలియన్ సరస్సులో పడవలో ప్రయాణిస్తున్న వారిపై ఒక్కసారిగా పర్వత కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. 
 
ఈ ఘటన శనివారం బ్రెజిల్‌లోని మినాస్ గెరైస్ రాష్ట్రంలోని కాపిటోలియో అనే ప్రాంతంలో ఉండే సరస్సులో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
మరోవైపు, ఈ ప్రమాదంలో తప్పిపోయిన మరో 20 మంది పర్యాటకుల కోసం సహాయక బృందాలు, అగ్నిమాపకదళ బృందాలు గాలిస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.