శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 8 సెప్టెంబరు 2016 (16:27 IST)

'జైలుకైనా వెళుతాను కానీ, ఇంటికి రాను'... అమెరికా వృద్ధుడి శపథం

'జైలుకైనా వెళుతాను కానీ, ఇంటికి రాను' అంటూ 70 యేళ్ళ వృద్ధుడు శపథం చేశాడు. అమెరికాలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... అమెరికాలోని కాన్సస్ నగరానికి చెందిన 70 ఏళ్ల లారెన్స్ రిపిల్ తన భార్య రెమ

'జైలుకైనా వెళుతాను కానీ, ఇంటికి రాను' అంటూ 70 యేళ్ళ వృద్ధుడు శపథం చేశాడు. అమెరికాలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... అమెరికాలోని కాన్సస్ నగరానికి చెందిన 70 ఏళ్ల లారెన్స్ రిపిల్ తన భార్య రెమిడియోస్‌తో  గొడవ పడ్డాడు. ఇక భార్యను చూడొద్దు అనుకున్న ఆయన.. జైలుకెళ్లేందుకు ఓ ప్లాన్ వేశాడు. కాన్సస్ సిటీ బ్యాంకులో దోపిడికి పాల్పడ్డాడు. తన వద్ద తుపాకీ ఉందంటూ బెదిరించి డబ్బులు దోపిడి చేసిన ఆయన.. పోలీసులు వచ్చేవరకు వేచి ఉండి వారికి లొంగిపోయాడు.
 
దీని వెనుక పెద్ద ప్లాన్ లేకపోలేదు. గయ్యాళీ సూర్యకాంతంలాంటి భార్య ఉన్న ఇంటికంటే తన కొత్త లొగిలి అయిన జైలే బాగుందని, ఇక్కడ మంచి సహచర ఖైదీలు, టైమ్‌కు తిండి, నిద్ర, సరైన వైద్య చికిత్స లభిస్తున్నాయని పెద్దాయన లారెన్స్ రిపిల్ ఇప్పుడు ఆనందపడిపోతున్నాడు. భార్యకు దూరంగా ఉండాలంటే విడాకులు ఇవ్వాలంటే పెద్ద ప్రాసెస్ అందుకే ఆ పని చేయకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాడు.