గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 10 ఆగస్టు 2017 (15:07 IST)

యాంకర్ వార్తలు చదువుతోంది... వెనుక న్యూస్ రూంలో ఉద్యోగి పోర్న్ వీడియో వీక్షణ

బీబీసి వార్తా సంస్థ అనగానే చాలా ఉన్నత విలువలు కలిగినదిగా పేరు. ఐతే ఈ వార్తా సంస్థలో సోమవారం అర్థరాత్రి జరిగిన ఘటన ఆ సంస్థ పరువు తీసే విధంగా వుంది. విషయం ఏంటయా అంటే... సోమవారం అర్థరాత్రి లేడీ న్యూస్ యాంకర్ వార్తలను చదివే పనిలో వుంది.

సహజంగానే యాంకర్ వార్తలు చదువుతుంటే వెనుక వుండే న్యూస్ రూంలో పనేచేసే సిబ్బంది వార్తా సేకరణలో తెగ కష్టపడిపోతున్నట్లు సీన్లు కనిపిస్తుంటాయి. ఐతే ఇక్కడ ఆ ఉద్యోగి ఏం చేశాడంటే... ఎంచక్కా చెవులకు హెడ్ సెట్ పెట్టుకుని టీవీలో పోర్న్ వీడియో చూస్తూ వున్నాడు. 
 
ఇది కాస్తా ప్రత్యక్ష ప్రసారంలో దొరికిపోయింది. ఆ సమయంలో తన కెమేరాకు పనిచెప్పిన ఓ వ్యక్తి దాన్ని యూ ట్యూబులో పోస్ట్ చేశాడు. ఇప్పుడది వైరల్ గా మారింది. కాగా ఈ ఘటనపై బీబీసి విచారణకు ఆదేశించింది.