శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 29 అక్టోబరు 2016 (14:33 IST)

బిల్ గేట్స్ సంపదతో 125 కోట్ల భారతీయులకు ఆహారం స్పాన్సర్ చేయగలరట!

బిల్ గేట్స్.. పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ప్రపంచంలో అత్యధిక ధనవంతుడు. ఈయన ఆస్తి అక్షరాలా రూ.5,34,600 కోట్లు (80 బిలియన్ డాలర్లు). అంటే ఈయన సెకనుకు అర్జించే సంపాదన రూ.10 వేల పైమాటే. అలాంట

బిల్ గేట్స్.. పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ప్రపంచంలో అత్యధిక ధనవంతుడు. ఈయన ఆస్తి అక్షరాలా రూ.5,34,600 కోట్లు (80 బిలియన్ డాలర్లు). అంటే ఈయన సెకనుకు అర్జించే సంపాదన రూ.10 వేల పైమాటే. అలాంటి బిల్ గేట్స్.. తన మొత్తం సంపదతో భారతదేశంలోని 125 కోట్ల మందికి ఆహారాన్ని, టీని స్పాన్సర్ చేయవచ్చట. అప్పటికీ ఆయన సంపద ఏమాత్రం తరిగిపోదట. 
 
ఈయన ఇప్పటికే అనేక ధాతృత్వ కార్యక్రమాలు చేస్తున్నారు. 2000 సంవత్సరంలో బిల్ గేట్స్ తన భార్యతో కలసి బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎయిడ్స్ నిర్మూలన, పలు ప్రపంచ దేశాలల్లో అంటువ్యాధుల నిర్మూలన, పేదవారికి విద్య వంటి మొదలైన వాటికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో బిల్ గేట్స్ సంపదతో ఏం చేయవచ్చన్న దానిపై సోషల్ మీడియాలో విస్తృతంగానే చర్చ సాగుతోంది. ఆ చర్చలోని ఆసక్తికర విషయాలపై ఓ లుక్కేద్ధాం. బిల్గేట్ తన ఆస్తులతో దేశ రాజధాని ఢిల్లీలోని బనారస్ ప్రజలందరికీ ఇళ్లు కొనగలరని తెలుస్తోంది. నోయిడాలోని బనారస్ ప్రాంతంలో ఒక్కో ఫ్లాట్ ధర రూ.18-22 లక్షల వరకూ ఉంటుంది. నలుగురు వ్యక్తులు ఒక్క ఇంట్లో ఉంటే, 30 లక్షల ఫ్లాట్స్ను కోటి 20 లక్షల మంది ప్రజలకు కొనివ్వగలరట. 
 
చండీగఢ్‌లో నివసించే 10.5 లక్షల ప్రజలకు, ఒక్కొక్కళ్లకి రూ.6.33 లక్షల విలువ చేసే బొలేరాను కొని బహుమతిగా ఆయన ఇవ్వగలరట. దీంతో చండీఘర్ ప్రాంతంలో 1.5 లక్షల బొలేరాలు రోడ్లపై తిరుగుతాయట. మైక్రోసాప్ట్ స్థాపనతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిల్గేట్స్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో దానాలు, ధర్మాలు చేస్తున్నారు. 125 కోట్ల భారత దేశ జనాభా మొత్తాన్నికి ఆహారాన్ని, టీని స్పాన్సర్ చేసినా.. ఆయన ఆస్తులు తరిగిపోవట. గేట్స్ పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచంలో ఉన్న వారందరికీ రూ.650లు ఇచ్చినా.. ఆయన దర్జాగా.. విలాసవంతమైన జీవితం గడపగలరట.