గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 27 జూన్ 2017 (21:36 IST)

తెలిసినోళ్లే కదా అని కారెక్కితే చెరిపేశారు : దివ్యాంగురాలిపై లైంగికదాడి

తెలిసినోళ్లే కదా అని కారెక్కిన ఓ దివ్యాంగురాలిపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను గదిలో బంధించి, పది రోజులపాటు ఆమెపై లైంగికదాడి చేశారు. ఈ దారుణం ఫ్లోరిడాలో జరిగింది. ఈ వివరాలను పరిశీల

తెలిసినోళ్లే కదా అని కారెక్కిన ఓ దివ్యాంగురాలిపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను గదిలో బంధించి, పది రోజులపాటు ఆమెపై లైంగికదాడి చేశారు. ఈ దారుణం ఫ్లోరిడాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
ఫ్లోరిడాకు జేమ్స్‌ ఎర్గోడన్(37), జానీ టిండాల్(36)లు మంచి స్నేహితులు, పైగా పచ్చి తాగుబోతులు. మే చివరి వారంలో వారు సెంట్రల్ ఫ్లోరిడాకు వెళ్లారు. అక్కడ ఒక మహిళ వారికి పరిచయమైంది. ఆమె సెంట్రల్ ఫ్లోరిడా నుంచి సౌత్ ఫ్లోరిడాకు వెళ్లేందుకు సిద్ధమైంది.
 
ఈ విషయం తెలుసుకున్న ఆ తాగుబోతులు తమ కారులో లిఫ్ట్ ఇచ్చామని చెప్పడంతో వారిని నమ్మి కారెక్కింది. ఆ తర్వాత ఆ మహిళను వారు పథకం ప్రకారం కిడ్నాప్ చేశారు. ఆమెకు ముందుగా మత్తు మందు ఇచ్చి ఒక హోటల్‌కు తీసుకెళ్లి పదిరోజులపాటు ఆమెపై లైంగిక దాడి చేశారు. 
 
విడిచిపెట్టాలని ఆమె కోరినప్పుడల్లా ఆమెను తీవ్రంగా కొట్టేవారని పోలీసులు చెబుతున్నారు. పది రోజుల తర్వాత ఆమెను అమ్మేయాలనే ఉద్దేశంతో ఆమెను సెంట్రల్ ఫ్లోరిడాకు తీసుకువచ్చారు. అప్పుడామె చాకచక్యంగా కారులో నుంచి దూకేసి పోలీసులను ఆశ్రయించింది.