బుధవారం, 30 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 17 జూన్ 2016 (14:58 IST)

బిల్ గేట్స్ చికెన్ దానం మాకొద్దు: బొలీవియా స్పష్టం

ఆకలి కేకలతో ఉన్న దేశాలకు తన దగ్గర ఉన్న కోళ్లను దానం చేయాలనుకున్న సంపన్నుడు బిల్ గేట్స్‌కు షాక్ తప్పలేదు. బొలివియా దేశం మాత్రం బిల్‌గేట్స్ పంపే కోళ్ళు తమకు వద్దని నిరాకరించింది.

ఆకలి కేకలతో ఉన్న దేశాలకు తన దగ్గర ఉన్న కోళ్లను దానం చేయాలనుకున్న సంపన్నుడు బిల్ గేట్స్‌కు షాక్ తప్పలేదు. బొలివియా దేశం మాత్రం బిల్‌గేట్స్ పంపే కోళ్ళు తమకు వద్దని నిరాకరించింది. ఆకలి బాధలతో ప్రజలు నానా అవస్థలు పడుతుంటే వారికి సాయం చేయాలనుకుని బిల్‌గేట్స్ కోళ్లను బొలివియాకు పంపారు. 
 
కానీ ఆయన ఇచ్చే కోళ్ళు మాకు అవసరం లేదని బొలివియా అభివృద్ధి శాఖ మంత్రి సీజర్ కోకారికో వెల్లడించారు. ప్రతి సంవత్సరం బొలివియా 197 మిలియన్ల కోళ్లను ఉత్పత్తి చేస్తోంది. బొలివియా 36 మిలియన్ల కోళ్లు విదేశాలకు ఎగుమతి చేస్తున్న తరుణంలో కోళ్ల దానం వద్దని హెచ్చరించింది. 
 
100,000 కోళ్ళను బిల్ గేట్స్ బొలివియాకు విరాళంగా ఇవ్వదలిచారని కానీ అందుకు ఆ దేశం విముఖత చూపిందని బిల్ గేట్స్ కంపెనీ వర్గాలు తెలిపాయి. కాగా ఆఫ్రికా దేశంతో పాటు బొలివియాలు పేద దేశాలుగా పరిగణించబడుతున్నాయి. కానీ బొలివియా మాత్రం తమ ఆర్థిక వృద్ధి రేటు పెరిగిందని చెప్తోంది.