శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (11:56 IST)

నిజమే... గాల్వాన్ ఘటనల 45 మంది చనిపోయారు : చైనా ప్రకటన

గత యేడాది జూన్ నెలలో సరిహద్దుల్లోని గాల్వన్ లోయ వద్ద భారత్‌తో జరిగిన ఘర్షణలో తమ దేశానికి చెందిన 45 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు చైనా తొలిసారి ప్రకటించింది. నిజానికి ఈ ఘర్షణలో భారత సైనికులు 20 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అలాగే, చైనా వైపు నుంచి మృతుల‌/గాయ‌ప‌డిన వారి సంఖ్య 35 ఉంటుంద‌ని అప్ప‌ట్లో భార‌త్ ప్ర‌క‌టించింది. 
 
కానీ, ఆ సంఖ్యను చైనా నిర్ధారించలేదు. ఈ నేపథ్యంలో గాల్వాన్ ఘ‌ర్ష‌ణ‌లో చైనా సైనికులు 45 మంది మృతి చెందార‌ని ఇటీవ‌ల ర‌ష్యా మీడియా కూడా  ప్ర‌క‌టించింది. అయితే, తమ సైనికులు చనిపోలేదని ఇన్ని నెల‌లూ చెప్పుకుంటూ వ‌చ్చిన వ‌చ్చిన చైనా చివ‌ర‌కు చేసేది ఏమీ లేక మృతుల సంఖ్య‌ను ప్ర‌క‌టించింది.
 
అయితే, త‌మ సైనికులు ఐదుగురు మాత్ర‌మే చ‌నిపోయార‌ని చెప్పుకొచ్చింది. అంతేగాక‌, వారికి అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. వారి పేర్లను కూడా చైనా విడుదల చేసింది. జిన్‌జియాంగ్ మిలిటరీ కమాండ్‌కు చెందిన రెజిమెంటర్ కమాండర్ క్వి ఫాబావోతో పాటు క్విఫాబావో, చెన్ హాంగ్‌జున్, చెన్ జియాంగ్ ‌రాంగ్, జియావో సియువాన్, వాంగ్ జువారన్ అనే సైనికులు చ‌నిపోయిన‌ట్లు చెప్పింది.